ఇప్పుడున్న రాజకీయాలు ముఖ్యంగా టీఆర్ ఎస్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్టు సాగుతున్నాయి. హుజూరాబాద్‌లో వీరిద్దరిలో ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఈటలను ఓడించి పార్టీ పరువును నిలబెట్టుకోవాలని టీఆర్ ఎస్ ప్రయత్నిస్తోంది. కానీ తనకు తిరుగులేకుండా గెలుస్తానని ఈటల భావిస్తున్నారు. అయితే ఇంతకు ముందు జరిగిన ఉప ఎన్నికల తీరును చూస్తే కాస్త ఆలోచించాల్సిందే
దుబ్బాక, సాగర్ ఉప ఎన్నికలు జరిగినప్పుడు దుబ్బాక మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టారు జనాలు. అక్కడ అధికార పార్టీకి చెక్ పెడతూ అనూహ్యంగా బీజేపీ నుంచి రఘునందన్‌రావు గెలిచారు. ఇక సాగర్‌లో బీజేపీకి పెద్దగా పట్టు లేకపోవడంతో అక్కడ అనకున్నట్టుగానే టీఆర్ఎస్ గెలిచింది.
అయితే ఇప్పుడు హుజూరాబాద్‌లో బీజేపీ నుంచి బలమైన అభ్యర్థిగా ఈటల రాజేందర్ పోటీ చేస్తుండటంతో ఇది కూడా మళ్లీ దుబ్బాక అవుతుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈటలకు ఇక్కడ నుంచి పోటీచేసిన నాలుగుసార్లు గెలిచారు. ఆయన సిట్టింగ్ స్థానం కాబట్టి ఆయనే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చూడాలి మరి ఎవరు గెలుస్తారో.