రానున్న తెలంగాణ ఎన్నికల్లో మెజారిటీ ఓట్లు సాధించి..మళ్ళీ అధికారం సాధించడమే దిశగా కేసిఆర్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. ముచ్చటగా మూడోసారి సైతం అధికారం దక్కించుకోవాలని కేసిఆర్ ముందుకెళుతున్నారు. ఆ దిశగా కేసిఆర్ పనిచేస్తున్నారు. మొన్నటివరకు దేశ రాజకీయాలపై కాస్త ఫోకస్ పెట్టి పనిచేసిన కేసిఆర్..ఇప్పుడు రూట్ మార్చారు. స్టేట్ పాలిటిక్స్ పై ఫోకస్ పెట్టారు.
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ముందు..ఇక్కడ గెలిచి ఆ తర్వాత కేంద్రంలో సత్తా చాటాలని చూస్తున్నారు. ఇక తెలంగాణలో గెలిచేందుకు ఇప్పుడు కేసిఆర్ జనంలోకి వెళుతున్నారు. భారీ సభల్లో పాల్గొంటున్నారు. అలాగే ప్రజలకు బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు. వరుస పెట్టి జిల్లా పర్యటనలకు వెళుతూ..భారీ సభలు పెడుతున్న కేసిఆర్..ఓట్ల వేట మొదలుపెట్టారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా బిఆర్‌ఎస్ పార్టీ మాత్రమే పెద్ద ఎత్తున తెలంగాణని అభివృధ్ది చేసి దేశంలోనే నెంబర్ 1గా పెట్టిందని అంటున్నారు. తెలంగాణ మోడల్ మాకు కావాలని దేశమంతా కోరుతున్నారని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ చిమ్మ చీకటి అయితదని నాడు ఆంధ్రా నాయకులు శాపం పెట్టారని..ఇప్పుడు తెలంగాణ వెలుగుతుంటే, ఆంధ్రా చీకట్లలో ఉందని అన్నారు.
ఇదే క్రమంలో కేసిఆర్ ఓట్లు రాల్చే పథకాలపై ఫోకస్ పెట్టారు. గృహలక్ష్మి కింద నియోజకవర్గానికి 4 వేల ఇళ్లు మంజూరు చేస్తున్నామని, వృత్తిపని వారు ఉన్నారు.. బీసీ కులాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి కుటుంబానికి లక్ష సాయం చేస్తున్నామని, జూన్ 9 నుంచి ప్రారంభించబోతున్నామన్నారు.
అయితే ఇప్పటికే దళితబంధు..రూ.10 లక్షలు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పుడు ఇల్లు కట్టుకునేవారికి సాయం, అలాగే బీసీ ఓట్లని ఆకట్టుకోవడానికి కుల వృత్తుల వారికి లక్ష ఇచ్చేందుకు కేసిఆర్ ముందుకొచ్చారు. మొత్తానికి ఓట్లని టార్గెట్ చేసుకునే కేసిఆర్ ఈ పథకాలు షురూ చేశారు. మరి ఇవి ఏమాత్రం ఓట్లు రాలుస్తాయో చూడాలి.