ట్రయాంగిల్ ఫైట్ లో పై చేయి ఆ ఇద్దరు నేతలదేనా

-

ఖమ్మం జిల్లాలో రాజకీయాలు మూడు వర్గాలుగా మారిపోయింది. గతంలో కలిసి నడిచిన నేతలు.. ఇప్పుడెందుకు తలోదారిన పోతున్నారు. ఏ పదవి లేకున్నా మాజీ మంత్రి,మాజీ ఎంపీ విస్తృత పర్యటనలు దేనికి సంకేతం..మంత్రికి అధిష్టానం నుంచి మద్దతు ఉన్నా కేడర్ మొత్తం ఆ ఇద్దరు నేతలే చుట్టే తిరుగుతుంది. ట్రాయాంగిల్ ఫైట్ లో ఆ మాజీల ఇద్దరి చుట్టే రాజకీయం నడవడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

 

ఖమ్మం జిల్లాలో రాజకీయాలు మూడు వర్గాలుగా మారిపోయింది. జిల్లాలో మొదట్నుంచీ అన్ని నియోజవకర్గాల్లో తిరుగుతున్నారు పొంగులేటి శ్రీనివాస రెడ్డి. తనను ఆహ్వానించిన వారి దగ్గరకు వెళ్లడం… వారిని ఆశీర్వదించి రావడం కామన్ మారిపోయింది. అయితే కొద్ది రోజుల నుంచి తుమ్మల నాగేశ్వరరావు కూడ ఇదే పంధాను అనుసరిస్తున్నారు. తుమ్మల, పొంగులేటిలు ఇద్దరు జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ హల్ చల్ చేస్తున్నారు. అలాగని, వారిద్దరికీ టీఆర్ఎస్‌లో ఎలాంటి పదవీ లేదు. అయినా, వీరిద్దరూ ప్రతి చిన్న పంక్షన్ కు, పెళ్లికి, పేరంటానికి , చావులకు, కర్మలకు వెళ్లి రావడం పరిపాటిగా మారిపోయింది. ఏ అధికారం లేకుండానే.. జిల్లా వ్యాప్తంగా చక్కర్లు కొట్టేస్తున్నారు ఈ ఇద్దరు నేతలు.

ఇక వెళ్లినచోటల్లా వీరిద్దరికీ కార్యకర్తలు కూడా అదేస్థాయిలో నీరాజనాలు పడుతున్నారు. పొంగులేటి చాలారోజుల నుంచే పర్యటనలు మొదలెట్టగా.. తుమ్మల ఇటీవలే యాక్టివ్ అయ్యారు. మూడు దశాబ్దాల అనుభవం కలిగిన తుమ్మలను వదులుకునేందుకు జిల్లా నాయకత్వం సిద్దంగా లేదు. తుమ్మలను ఒంటరిని చేయాలని పువ్వాడ, పొంగులేటి లు చేసిన ప్రయత్నాలు కూడా సఫలీకృతం కాలేదు. జనవరి ఒకటిన తుమ్మల ఇంటికి జిల్లా నలుమూలల నుంచి భారీసంఖ్యలో కార్యకర్తలు వచ్చి.. తామున్నామంటూ భరోసా ఇచ్చారు. దీంతో తుమ్మల కూడా జిల్లా రాజకీయాల్లో యాక్టివ్‌గా మారిపోయారు.

అధికారంలో లేని తుమ్మల, పొంగులేటిలిద్దరూ.. జిల్లాను చుట్టేస్తుండగా మంత్రి అజయ్ కుమార్ మాత్రం జిల్లా కేంద్రానికి..అది కూడా సొంత నియోజకవర్గానికి పరిమితం అయ్యారు. అడపాదడపా జిల్లాలో పలు ప్రాంతాలకు వెళ్తున్నా వాటికి పెద్దగా ప్రాధాన్యత ఏర్పడటం లేదు. తుమ్మల, పొంగులేటి.. ప్రతి పంక్షన్‌కూ అటెండవుతుండగా.. అజయ్ మాత్రం అదికారిక కార్యక్రమాలకు మాత్రమే వెళ్లి వస్తున్నారు. అయితే అజయ్ తిరిగే కార్యక్రమాలు.. రాజకీయంగా క్లిక్ కావడం లేదు. అయితే, యువ నేత కేటీఆర్‌ అండదండలు బలంగా ఉండడంతో.. జిల్లా కేంద్రంలో పట్టు కొనసాగిస్తున్నారు మంత్రి అజయ్ కుమార్.
మరీ ట్రయాంగిల్ ఫైట్ మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version