కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి. . . .రంగారెడ్డి జిల్లాలోఅత్యంత సుపరిచితుడైన డైనమిక్ లీడర్ ఈయన. కాంగ్రెస్ పార్టీలో కీలకనేతగా ఉన్న కెఎల్‌ఆర్‌కి ఇప్పుడు ఎలక్షన్ మూడ్ వచ్చేసింది. అందుకే కెసిఆర్ కేబినెట్‌లోని ముగ్గురు మంత్రులు ప్రాతినథ్యం వహిస్తున్న మూడు నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు కెఎల్‌ఆర్. అయితే ఏ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో ఆయన బరిలో ఉంటారు అనేది క్లారిటీ లేదు. కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు అతన్ని ఏదో ఒక నియోజకవర్గం నుంచి బరిలో ఉంచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మంత్రుల పనితీరు, లోటుపాట్లపై కెఎల్‌ఆర్ ప్రధానంగా దృష్టి సారించారు. వారి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు.
మహేశ్వరం ప్రాంతంలో బలంగా ఉన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇంతకుముందు ఆమె కాంగ్రెస్ నుంచి అధికార బిఆర్ఎస్‌లోకి వలసవెళ్ళారు. మంత్రి అయ్యాక ఆమె సాగిస్తున్న దందాలు,అవినీతి అక్రమాలపై కెఎల్‌ఆర్ దృష్టి సారించారు. ఆమె మంత్రిగా ఉన్నప్పటికీ నియోజకవర్గ ప్రజలకు వెలగబెడుతున్నది ఏమీ లేదని జనానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కెఎల్‌ఆర్. అభివృద్ధి పనులు చేయకపోగా పాలనలో కూడా వైఫల్యం చెందినట్లు ఆయన ఆరోపిస్తున్నారు. మంత్రిగా ఆమె అనర్హురాలంటూ తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.
మరో మంత్రి మల్లారెడ్డిపై కూడా కెఎల్‌ఆర్ దృష్టి సారించారు. ప్రస్తుతం మల్కాజ్‌గిరి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మల్లారెడ్డి తన వ్యాపారాలను చక్కబెట్టుకోవడానికే అధిక సమయం కేటాయిస్తుంటారు. మైక్ అందుకుని తన కామెడీతో జనాలను నవ్వించడం తప్ప ఆయన పెద్దగా అభివృద్ధి చేసిందేమీ లేదని కెఎల్‌ఆర్ చెప్తున్నారు. రేయింబవళ్ళు కెసిఆర్ భజనలో తరిస్తుంటారనే తప్ప జనాలకు అసలు అందుబాటులోనే ఉండరని ఆయనపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశాలపై కెఎల్‌ఆర్ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్ఎస్ తరఫున ఇక్కడి నుంచి బరిలోకి దిగనున్నట్లు ప్రచారం కూడా వినిపిస్తోంది. అధిష్టానం కూడా ఇదే నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.
ఇక కెఎల్‌ఆర్ దృష్టి సారించిన మరో నియోజకవర్గం తాంగూరు. ఇక్కడ పట్నం మహేందర్ రెడ్డిని కూడా కిచ్చన్నగారి లక్ష్మారెట్టి ఢీకొట్టే అవకాశం ఉండవచ్చంటున్నారు. బిఆర్‌ఎస్‌లో ఆర్ధిక, అంగ బలాలు ఉన్న బలవంతమైన నేతగా ఉన్న మహేందర్‌రెడ్డిని ఎదుర్కోవడం అంత సులభం కాదు. ఇక్కడ కెఎల్‌ఆర్ అయితేనే గట్టి పోటీ ఇవ్వొచ్చని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ అదే కన్‌ఫామ్ అయితే తాండూరులో బీఆర్ఎస్ కు కాంగ్రెస్‌కీ మధ్య టఫ్ ఫైట్ తప్పదు మరి. ఈ మూడు నియోజకవర్గాల్లో కెఎల్ఆర్ ఎక్కడి నుంచి పోటీ చేసినా కాంగ్రెస్‌కి అసెంబ్లీలో ఒక సీటు ఖచ్చితంగా గెలుచుకోవచ్చని ప్రస్తుతం వినిపిస్తున్న ప్రచారం. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందోనని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.