సంచలనం సృష్టిస్తున్న కొడాలి సవాళ్ళు… రాజకీయ సన్యాసం ఎందుకు?

-

ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో మంత్రి కొడాలి నాని సవాళ్ళు సంచలనం సృష్టిస్తున్నాయి. ఊహించని విధంగా కొడాలి ప్రత్యర్ధులకు సవాళ్ళు చేస్తూ ఉత్కంఠ రేపుతున్నారు. తాజాగా ఏపీలో పవన్ కల్యాణ్, వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం…అదే బూతుల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. పవన్ ఏమో…జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అటు వైసీపీ నేతలు కూడా పవన్‌కు అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు.

తాజాగా పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు…నెక్స్ట్ ప్రభుత్వం మారుతుందని, 2024 ఎన్నికల్లో జనసేన విజయ ఢంకా మొగిస్తుందని, వైసీపీ 151 సీట్ల నుంచి 15 సీట్లకు పడిపోవచ్చని మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై కొడాలి స్పందిస్తూ….జగన్‌ని మాజీ సీఎం చేయడం పవన్ రాజకీయ జీవితంలో చేయలేరని మాట్లాడారు. పవన్…చంద్రబాబు…ఇంకా ఎన్ని పార్టీలు కలిసొచ్చిన జగన్‌ని ఓడించడం కష్టమని అన్నారు. బాబు బూట్లు నాకే పవన్…ముందు ఎమ్మెల్యేగా గెలుస్తారో లేదో చూసుకోవాలని హెచ్చరించారు. అయితే జగన్‌ని మాజీ సి‌ఎం చేస్తే…తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని కొడాలి సవాల్ చేశారు.

అంటే నెక్స్ట్ ఎన్నికల్లో గెలుస్తామని కొడాలికి బాగా కాన్ఫిడెన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది. సరే నెక్స్ట్ గెలిచే ఛాన్స్ ఉన్నా సరే…కంటిన్యూగా జగనే సి‌ఎంగా ఉంటారని చెప్పడం అనేది కాస్త అతిశయోక్తిగా ఉంది. ఈ విషయంలోనే కాదు…ఇటీవల చంద్రబాబు విషయంలో కూడా కొడాలి ఓ సవాల్ విసిరారు. నెక్స్ట్ కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాట్లాడారు.

అంటే కుప్పంలో చంద్రబాబు గెలవరని కొడాలి బాగా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. మరి ఇంత కాన్ఫిడెంట్‌గా కొడాలి సవాల్ విసరడానికి కారణం మాత్రం అర్ధం కావడం లేదు. చూడాలి మరి నెక్స్ట్ జగన్ మాజీ సి‌ఎం అవ్వడం, చంద్రబాబు ఓడటం జరుగుతాయో లేదో. అలాగే కొడాలి సవాళ్ళు నిజమవుతాయో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version