రూట్ మార్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి…సెట్ చేసుకున్నట్లేనా!

-

కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( Komati reddy venkat reddy )…కరుడుకట్టిన కాంగ్రెస్ వాది. దశాబ్దాల కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న నాయకుడు. ఎమ్మెల్యేగా అనేక పర్యాయాలు గెలిచిన నేత. మంత్రిగా సేవలు అందించిన కోమటిరెడ్డి ఇప్పుడు ఎంపీగా పనిచేస్తున్నారు. ఇలా ఎంపీగా పనిచేస్తున్న కోమటిరెడ్డి, తనకు కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ ఇస్తుందని భావించారు.

కానీ అధిష్టానం ఊహించని విధంగా రేవంత్ రెడ్డికి పీసీసీ ఇచ్చింది. దీంతో వెంటనే కోమటిరెడ్డి తన అసంతృప్తి వెళ్ళగక్కారు. టీపీసీసీ ఇంకా టీటీడీపీ లాగా అవుతుందని, ఓటుకు నోటు కేసు లాగానే నోటుకు పీసీసీ వచ్చిందని విమర్శించారు. ఇక తాను గాంధీ భవన్ మెట్లు ఎక్కనని, ఇంకా సాధారణ కార్యకర్తలాగానే ఉంటూ తన పార్లమెంట్ ప్రజలకు సేవ చేస్తానని, ఎంపీగా తన కర్తవ్యాన్ని నెరవేరస్తానని చెప్పారు.

ఇక చెప్పిన విధంగానే కోమటిరెడ్డి రూట్ మార్చేశారు. కాంగ్రెస్ ఊసు తీయకుండా ఓ ఎంపీగా పార్లమెంట్ పరిధిలో తిరుగుతూ పనిచేస్తున్నారు. పార్లమెంట్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల నుండి నిధలు తెచ్చి భువనగిరి పార్లమెంట్ ప్రాంతం అభివృద్ధి కోసం కృషిచేస్తానని చెబుతున్నారు. గౌరెళ్లి నుంచి ఛ‌త్తీస్‌గ‌డ్ స‌రిహ‌ద్దుల వ‌ర‌కు జాతీయ ర‌హ‌దారిని మంజూరు చేయించిన‌ట్లు చెప్పిన కోమటిరెడ్డి, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పూర్తిచేశామని చెబుతున్నారు.

అంటే మొత్తానికి కోమటిరెడ్డి, తన పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలోనే కోమటిరెడ్డి ఎక్కువగా కేంద్రంలోని బీజేపీ పెద్దలతో టచ్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ పరిస్థితిని బట్టి చూస్తే కోమటిరెడ్డి బీజేపీలో వెళ్ళే అవకాశం లేకపోలేదని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పీసీసీ ఇవ్వలేదని కాంగ్రెస్ అధిష్టానం మీద అసంతృప్తితో ఉన్న కోమటిరెడ్డి బీజేపీలోకి వెళ్లొచ్చనే ప్రచారం ఉంది. కానీ కోమటిరెడ్డి నిజమైన కాంగ్రెస్ నాయకుడు అని, అసంతృప్తి ఉన్నా సరే ఆయన పార్టీ మారడం కష్టమని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. చూడాలి మరి రానున్న రోజుల్లో కోమటిరెడ్డి రాజకీయం ఎలా ఉంటుందో?

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version