కోమటిరెడ్డి వర్సెస్ కంచర్ల..నల్గొండ హోరాహోరీ.!

-

నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం అంటే కాంగ్రెస్ కంచుకోట. ఇక్కడ కాంగ్రెస్ మెజారిటీ సార్లు విజయం సాధించింది. మొదట్లో కమ్యూనిస్టుల హవా నడిచిన..తర్వాత కాంగ్రెస్ సత్తా చాటింది. కానీ టి‌డి‌పి ఆవిర్భావంతో సీన్ మారింది. 1983, 1985, 1989, ఎన్నికల్లో టి‌డి‌పి గెలిచింది. టి‌డి‌పి నుంచి ఎన్టీఆర్..1985లో గెలిచారు. 1994లో సి‌పి‌ఐ గెలవగా, 1999 నుంచి అక్కడ కాంగ్రెస్ హవా మొదలైంది. అది కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయాలు మొదలయ్యాయి. 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా గెలిచారు.

అలా విజయాలతో దూసుకెళుతున్న కోమటిరెడ్డికి కంచర్ల భూపాల్ రెడ్డి చెక్ పెట్టారు. 2018 ఎన్నికల్లో ఊహించని విధంగా కోమటిరెడ్డిని ఓడించారు. దాదాపు 23 వేల ఓట్ల మెజారిటీతో కంచర్ల గెలిచారు. ఇక ఎమ్మెల్యేగా కంచర్ల దూకుడుగా పనిచేస్తూ వెళుతున్నారు. అయితే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కోమటిరెడ్డి కాంగ్రెస్ నుంచి భువనగిరి ఎంపీగా విజయం సాధించారు. అయితే ఈ సారి ఆయన నల్గొండ అసెంబ్లీ బరిలో దిగడానికి రెడీ అయ్యారు. అటు బి‌ఆర్‌ఎస్ నుంచి కంచర్ల అభ్యర్ధిగా మళ్ళీ ఫిక్స్ అయ్యారు.

దీంతో కోమటిరెడ్డి వర్సెస్ కంచర్ల అన్నట్లు పోరు రసవత్తరంగా సాగుతుంది. ఎన్నికల్లో గెలవడానికి ఎవరి ఎత్తులు వారు వేస్తున్నారు. తాజాగా బి‌ఆర్‌ఎస్ సభలో ఒంటి చేయి వాడినంటూ కొందరు తనని ఎగతాళి చేశారని కంచర్ల కన్నీరు పెట్టుకున్నారు. కోమటిరెడ్డిని ఉద్దేశించే ఆయన వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది.

దీనికి కోమటిరెడ్డి వెంటనే కౌంటర్ ఇచ్చారు..కళ్ళలో జండుబామ్ పెట్టుకుని ఏడ్చే అలవాటు తనకు లేదని ఎద్దేవా చేశారు. మళ్ళీ తాను నల్గొండలో పోటీ చేస్తానని, భారీ మెజారిటీతో గెలుస్తానని సవాల్ విసిరారు. ఇలా ఇద్దరి మధ్య పోరు రసవత్తరంగా నడుస్తుంది. ప్రస్తుతం నల్గొండలో ఇద్దరూ సమాన బలంతో ఉన్నారు. మరి ఎన్నికల్లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version