తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ఈనెల 5తో ముగియనుంది. ఆ తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. 2018లో అక్టోబర్ 6న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగా… డిసెంబర్ 7న పోలింగ్ నిర్వహించి, 11న ఫలితాలు ప్రకటించారు. దీంతో 2023 ఎన్నికల షెడ్యూల్ ను ఈ నెల 6 నుంచి 12వ తేదీ మధ్య ఏ రోజైనా ప్రకటించవచ్చనే ప్రచారం జరుగుతోంది.
ఇందుకోసం మూడ్రోజుల పాటు హైదరాబాద్లో పర్యటించనుంది. ఇందులో భాగంగా ఇవాళ నగరానికి కేంద్ర ఎన్నికల సంఘం రానుంది. మూడు రోజుల పాటు హైదరాబాద్ పర్యటనలో రాజకీయ పార్టీలు, ఎన్నికల అధికారులతో ఈసీ బృందం సమావేశం కానుంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధత, సన్నాహకాలను సమీక్షించడంతో పాటు ప్రలోభాల కట్టడిపై ఈసీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించనున్నారు. మూడు రోజుల పర్యటన అనంతరం ఎన్నికల నిర్వహణా తేదీలపై ఈసీ ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని పూర్తి స్థాయి ఈసీ బృందం మూడు రోజుల పాటు తాజ్ కృష్ణా హోటల్లో బస చేయనుంది.