కౌశిక్ రెడ్డి…ఈ పేరు అంతకముందు తెలంగాణ రాజకీయాల్లో పెద్దగా ఎప్పుడూ హైలైట్ కాలేదు. కానీ ఎప్పుడైతే హుజూరాబాద్ ఉపఎన్నిక తెరపైకి వచ్చిందో అప్పటినుంచే కౌశిక్ రెడ్డి పేరు బయటకొచ్చింది. హుజూరాబాద్‌లో కాంగ్రెస్ బాధ్యతలు చూసుకుంటున్న కౌశిక్..రహస్యంగా కేటీఆర్‌తో మీటింగులు పెట్టడం, అలాగే తానే టీఆర్ఎస్ తరుపున పోటీ చేసే నాయకుడుని అంటూ ఫోన్లలో అనుచరులతో హడావిడిగా మాట్లాడటంతో అసలు సినిమా మొదలైంది.
టీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉన్న కౌశిక్‌కు…పిసిసి నుంచి షోకాజ్ నోటీసులు వచ్చాయి. నోటీసులు వచ్చిన వెంటనే కౌశిక్, కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి, రేవంత్‌పై తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఇక్కడ నుంచే కౌశిక్ హైలైట్ అవుతూ వచ్చారు. అసలు కౌశిక్, ఉత్తమ్ కుమార్ రెడ్డి బంధువని…2018 ఎన్నికల్లో హుజూరాబాద్‌లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ఈటలపై ఓడిపోయారని, 60 వేల ఓట్లు తెచ్చుకున్నారని తెలిసింది.
అయితే ముందు చేసిన ఈయన హడావిడి వల్ల టీఆర్ఎస్‌లో టిక్కెట్ దక్కలేదు. కానీ కేసీఆర్, కౌశిక్‌ని పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి ట్రై చేశారు. కానీ ఇలాంటి నాయకులకు ఎమ్మెల్సీ ఎలా ఇస్తారని గవర్నర్..కౌశిక్ పదవిని పెండింగ్‌లో పెట్టారు. ఈలోపే హుజూరాబాద్ ఉపఎన్నిక వచ్చేసింది. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ తరుపున కౌశిక్ ఎలాంటి ఓవర్ యాక్షన్ చేశారో అంతా చూశారు. ఈటలని ఎలా టార్గెట్ చేశారో కూడా తెలిసిందే. పైగా తానే ఏదో టీఆర్ఎస్‌ని గెలిపించేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చారు. ఇక ఎన్నిక రోజు పోలింగ్ బూతుల్లో తిరుగుతూ హడావిడి చేశారు. ఆ హడావిడే కొంపముంచింది…కౌశిక్‌ని ప్రజలు ఎక్కడకక్కడ అడ్డుకున్నారు.
ఈయన్ని ఓవర్ యాక్షన్ వల్ల టీఆర్ఎస్‌కు ఇంకా డ్యామేజ్ జరిగినట్లు ఉంది…అందుకే కౌశిక్ సొంత మండలం వీణవంకలో కూడా ఈటలకు మెజారిటీ వచ్చింది. ఉపఎన్నికలో ఈటల మంచి మెజారిటీతో మళ్ళీ గెలిచారు. ఈ గెలుపుతో కౌశిక్ కొంప మునిగిందననే చెప్పాలి…అటు ఎమ్మెల్సీ దక్కుతుందో లేదో తెలియడం లేదు…ఇటు టీఆర్ఎస్‌లో మళ్ళీ టిక్కెట్ దొరికే ఛాన్స్ కనిపించడం లేదు. మొత్తం మీద కౌశిక్ పరిస్తితి అస్సాం అయ్యేలా ఉంది.