కుమారస్వామి-ప్రకాష్ రాజ్ డుమ్మా..కేసీఆర్‌తో సెట్ అవ్వలేదా?

-

కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చి..జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి కర్ణాటకకు చెందిన జే‌డి‌ఎస్ అధినేత, మాజీ సీఎం కుమారస్వామి..కేసీఆర్ వెనుకే ఉంటున్నారు. ఢిల్లీలో పార్టీ ఆఫీసు భూమి పూజా జరిగేనా..హైదరాబాద్ లో బి‌ఆర్‌ఎస్ జెండా ఎగరవేసే సమయంలో కూడా కేసీఆర్ తో పాటే కుమారస్వామి ఉన్నారు.

ఇలా కేసీఆర్ వెనుక ఉంటూ వచ్చిన కుమారస్వామి..తాజాగా ఖమ్మంలో జరిగిన బి‌ఆర్‌ఎస్ తొలి ఆవిర్భావ సభళో మాత్రం కనిపించలేదు. అలాగే కేసీఆర్‌ సన్నిహితుడుగా ఉన్న ప్రకాష్ రాజ్ సైతం కనిపించలేదు. ఇక ఒకటికి రెండు సార్లు తమిళనాడు వెళ్ళి అక్కడ సీఎం స్టాలిన్‌ని కలిసొచ్చిఒన సరే..ఇప్పుడు సభకు స్టాలిన్ రాలేదు. ఇలా కీలక నేతలు బి‌ఆర్‌ఎస్ సభకు హాజరు కాలేదు. కేరళ, పంజాబ్, ఢిల్లీ సీఎంలు వచ్చారు. అంటే కమ్యూనిస్ట్, ఆప్ పార్టీలే వచ్చాయి. అటు ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ వచ్చారు.

వీరు తప్ప మిగిలిన నేతలు కనిపించలేదు. ముఖ్యంగా కుమారస్వామి సభకు రాకపోవడంపై పెద్ద చర్చ నడుస్తోంది. ఆయనకు ఆహ్వానం అందలేదా? లేక ఆయన బిజీగా ఉన్నారా? అనేది క్లారిటీ లేదు. అయితే కుమారస్వామి రాకపోవడంపై టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  కర్ణాటకళో 20 నుంచి 30 సీట్లలో కాంగ్రెస్ పార్టీని ఓడించడం కోసం అక్కడ పార్టీ కీలక నేతతో కేసీఆర్‌ బేరసారాలు చేశారని, అయితే కాంగ్రెస్‌ అధిష్ఠానం అప్రమత్తమై ఆ నాయకుడిని నియంత్రించి కుట్రను ఛేదించిందన్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తే బీజేపీకే లాభమని, అదే కేసీఆర్ ప్లాన్ అని, అది తెలుసుకుని కుమారస్వామి..బి‌ఆర్‌ఎస్ సభకు రాలేదని రేవంత్ అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో క్లారిటీ లేదు. కానీ అన్నీ కార్యక్రమాలకు వచ్చిన కుమారస్వామి..అసలు సభకు రాకపోవడంపై అనుమానాలు ఉన్నాయి. అటు ప్రకాష్ రాజ్ కూడా రాకపోవడం వెనుక కారణం తెలియదు. మొత్తానికి దీని వెనుక ఏదో రాజకీయం ఉందని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version