కేసీఆర్ ఫ్రంట్ సినిమాకు డైరెక్టర్ పీకే .. ప్రొడ్యూసర్ మోడీ.. నటుడు కేసీఆర్ : మధు యాష్కీ

-

కేసీఆర్ కొత్త ఫ్రంట్ ఏర్పాటు కు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత, ప్రచార కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ మధు యాష్కి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫ్రంట్ సినిమాకు డైరెక్టర్ ప్రశాంత్ కిషోర్ అని, ప్రొడ్యూసర్ మోడీ, నటుడు కేసీఆర్ అంటూ వ్యాఖ్యాలు చేశారు. కాంగ్రెస్ కుటుంబ పాలనకు వ్యతిరేఖం కాదని.. కుటుంబ దోపిడీకి వ్యతిరేఖం అంటూ.. టీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు.  మా పోరాటం సీఎంపైన, అధికారులపైన కాదని ఆయన అన్నారు. అవినీతిలో ఆంధ్రా అధికారా.. బీహార్ అధికారా అని ఉండదని ఆయన అన్నారు. తెలంగాణ ఐఏఎస్ అధికారులకు పదవులు ఇవ్వక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో అధికారికి ఎన్ని శాఖలు ఇస్తారని సీఎంను ప్రశ్నించారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అని, ప్రాంతీయ పార్టీ కాదని ఆయన అన్నారు. కేసీఆర్ నీ దొర లెక్క చూస్తా అంటూ వ్యాఖ్యానించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version