తిరుమల గరుడ సేవ రోజున 2 లక్షల మంది భక్తులను అనుమతించేలా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఇఓ శ్యామలరావు తెలిపారు. అదనంగా విచ్చేసే భక్తులను క్యూ లైనులు ద్వారా అనుమతిస్తాం అని పేర్కొన ఆయన.. గరుడ వాహన సేవను సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 11:30 గంటల వరకు వాహన సేవను నిర్వహిస్తాం అన్నారు. ఇక ఇందుకోసం 5 వేల మంది పోలిసులుతో భధ్రతా ఏర్పాట్లు ను చేస్తున్నాం. అన్నప్రసాద సముదాయంలో ఉదయం 7 గంటల నుంచి అర్దరాత్రి 1 గంట వరకు భక్తులకు అన్నప్రసాద సౌకర్యం కల్పిస్తాం. 400 బస్సులతో 3 వేల ట్రిప్పులు నడిపేలా ఆర్టిసి బస్సులు నడుపుతాం. ఘాట్ రోడ్డులు, నడకమార్గం 24 గంటల పాటు తెరిచి వుంచుతాం అన్నారు.
అదే విధంగా వాహన సేవలకు విచ్చేసే భక్తులు బ్యాగ్ లతో రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. కడప,చిత్తూరు, శ్రీకాళహస్తి,చెన్నై వైపు నుంచి వచ్చే వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం కల్పిస్తూన్నాం. పార్కింగ్ ప్రదేశాల నుంచి ఆర్టిసి బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేసాం అని తెలిపారు.