రాజకీయ కక్షలు ఎంతటికైనా తెగిస్తున్నాయి. ఆదిలాబాద్‌లో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం.
ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫారూక్ చేసిన వీరంగానికి అదృష్టవశాత్తు ప్రాణలు దక్కగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. జమీర్(55), మోతేషీన్‌లకు బుల్లెట్ గాయాలవ్వగా, మన్నాన్ కత్తిపోటుకు గురయ్యాడు.బాధితుడు జమీర్, ఫారూక్‌లకు రాజకీయ కక్షలు ఉన్నావి. గత పురపాలక సంఘం ఎన్నికల్లో తాటిగూడ కౌన్సిలర్ స్థానం, మహిళ రిజార్వు కావడంతో ఎంఐఎం నుంచి ఫారూక్ భార్య సమీనా, టీఆర్‌ఎస్ నుంచి జమీర్ అన్న కొడలు బరిలోకి దిగారు. ఇరువురి మధ్య జరిగిన పోటీలో సమీనా విజయం సాధించారు.
అంతకు ముందే కక్షలు..
అంతకు ముందున్న ఫారూక్, జమీర్ గొడవులు, ఎన్నికలు ముగిసిన తర్వాత పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మరాయి. ఎప్పుడు వివాదానికి దారి తీస్తోందోనని ఇరుపార్టీల కార్యకర్తలు భయాందోనలకు గురయ్యేవారు. ఈ క్రమంలో జమీర్, ఫారూక్‌ల పిల్లలు క్రికెట్ ఆడే సమయంలో చిన్నపాటి గొడవ చోటు చేసుకుంది. ఈ క్రమంలో వారు పొట్లాటకు దిగగా, అది కాస్త సాయంత్రం వరకు కుటుంబ సభ్యుల దాకా వెళ్లింది. దీంతో వారు గొడవలకు దిగి రాళ్లు, కట్టెలతో పరస్పర దాడులకు తెగబడ్డారు. ఇంతలో ఫారూక్ ఇంట్లో నుంచి 0.32 పిస్టల్, ఓ కత్తి తీసుకొచ్చి ప్రత్యేర్థులపై వీరంగం çసృష్టించాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా కాల్పులు జరపగా మోతేషీన్, జమీర్, మన్నాన్‌లలో ఇద్దరికి బుల్లెట్ గాయాలవ్వగా, ఒక్కరికి కత్తిపొటు తగిలింది. హుటాహుటిన క్షతగాత్రులను ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడు ఫారూక్‌ను అదుపులోకి తీసుకుని మరణాయుధాల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఓఎస్‌డీ ఎం. రాజేష్‌చంద్ర వెల్లడించారు.