శివసేన-జనసేన సిద్దాంతం ఒక్కటేనని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తాజాగా మహారాష్ట్ర నాందేడ్ జిల్లా డెగ్లూర్ నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. శివాజీ మహరాజ్ గడ్డ పై అడుగుపెట్టినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. సనాతన ధర్మాన్ని రక్షించేందుకే శివసేన-జనసేన ఆవిర్భవించాయని తెలిపారు. ఈ రెండు పార్టీలు అన్యాయం పై పోరాడుతాయని తెలిపారు. జాతీయ భావం, ప్రాంతీయతత్వం తమ పార్టీల సిద్ధాంతం అని వివరించారు.
మహాయతి తరుపున ప్రచారం నిర్వహించిన పవన్ బాల సాహెబ్ ఠాక్రె నుంచి ఎంతో నేర్చుకున్నానని వెల్లడించారు. రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు పవన్ కళ్యాణ్. మరికొద్ది సేపట్లో లాతూర్ చేరుకుంటారు. అక్కడ నిర్వహించే సభలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు షోలాపూర్ నగరంలో రోడ్ షోలో పాల్గొంటారు. నవంబర్ 17న విదర్భ ప్రాంతానికి వెళ్తారు. ఆ రోజు ఉదయం చంద్రపూర్ జిల్లాలోని బల్లార్ పూర్ పట్టణంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం పుణె కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు.