కేసీఆర్ పూర్తి చంద్రముఖిలా మారిపోయాడు అంటూ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫార్మ్ హౌస్లో కూర్చొని కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు అద్దంకి దయాకర్.
కేసీఆర్ రాజకీయ కుట్రలు అన్ని కేటీఆర్ అమలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తన కుమారుడిని ఎలాగైనా ఛాంపియన్ చేసేందుకు కేసీఆర్ ఆరాటపడుతున్నాడని నిప్పులు చెరిగారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్.
అధికారం చేజారి ఏడాది కూడా అవ్వకముందే మళ్ళీ అధికార దాహంతో ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్రలు చేస్తున్నారని ఆగ్రహించారు. అధికారులపై జరిగిన దాడిని కూడా సమర్థించుకుంటున్నారు అంటే వీళ్ళను ఏమనాలి ? అంటూ ఫైర్ అయ్యారు. సిగ్గుండాలి.. నేరెళ్ళ బాధితులను థర్డ్ డిగ్రీ ప్రయోగించింది మర్చిపోయావా..? అంటూ కేటీఆర్ పై ఆగ్రహించారు. కలెక్టర్ మీద దాడి చేసి..కుట్రలో ఉన్న వాళ్ళను అరెస్టు చేయరా..? అంటూ నిలదీశారు. ఇప్పుడు థర్డ్ డిగ్రీ గురించి కేటీఆర్ మాట్లాడుతున్నాడని నిప్పులు చెరిగారు.