అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ఏపీ అప్పులపై వైసీపీ, బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. శుక్రవారం యనమల మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నిధులు ఇవ్వకుండా వైసీపీయే ఆపించిందన్నారు. తప్పుడు ఫిర్యాదులు పంపేది వైసీపీ అని, దాన్ని సాకుగా చూపి నిధులు ఆపేది బీజేపీ అని యనమల ఆరోపించారు. బీజేపీ, వైసీపీ కుమ్మక్కై రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఆయన మండిపడ్డారు. ఏపీ అభివృద్ధి చెందడం బీజేపీ, వైసీపీకి ఇష్టంలేదని అన్నారు. ఏపీ అగ్రగామిగా ఉండటాన్ని ఆ రెండు పార్టీలు సహించలేక పోతున్నాయని యనమల మండిపడ్డారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం లేదని, 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం ఏపీకి రూ.22,761కోట్లు రావాల్సి ఉందని యనమల పేర్కొన్నారు.
కేంద్రం నిధులివ్వకుండా వైసీపీ అడ్డుపడుతోంది : యనమల
-