తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటి నుండో నానిపోతున్న ఒక అంశం వీఆర్వో వ్యవస్థ రద్దు అనే ఈ ముచ్చట.. అనడమే గానీ ఈ విషయంలో ఇప్పటి వరకు ఒక సృష్టత రాలేదు.. ఆ మధ్యకాలంలో అయితే ఈ విషయంలో పెద్ద చర్చనే జరిగింది.. రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన కోసం ప్రస్తుత పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు అధ్యక్షతన త్రిసభ్య కమిటీ వేయగా.. వీఆర్వోలు ఉండాల్సిందేనని తెలిపింది. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రద్దుచేయాలని గట్టిగా అనుకున్న క్రమంలో ఇక వీఆర్వో వ్యవస్థ రద్దు అవడానికి సమయం ఆసన్నమైంది అనుకున్న టైంలో అందరు సైలంట్ అయ్యారు..
కాగా తాజాగా మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. ఇక ఈ విషయం మరోసారి బయటకు రావడానికి కారణం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. పల్లెప్రగతి నియంత్రిగ సాగు విధానంపై జనగామ జిల్లా పాలకుర్తి మండలం మంచుప్పల గ్రామంలో పాల్గొన్న మంత్రి ఈ సందర్భంగా వీఆర్వోల గురించి ప్రస్తావించారు.. ప్రస్తుత పరిస్దితుల్లో రైతులు పడుతున్న కష్టాలకు ఈ గ్రామ రెవెన్యూ అధికారులే కారణం. అందుకే ఈ వ్యవస్థను రద్దు చేసే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నది అని సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చకు దారితీసింది..
ఇక రాష్ట్రంలో రెవెన్యూ శాఖను పునర్‌వ్యవస్థీకరించనున్నారని ప్రచారం జరుగుతున్న క్రమంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే మూడేళ్లుగా గ్రామ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసి, వ్యవసాయశాఖలో లేదా పంచాయతీరాజ్ శాఖలో విలీనం చేస్తారని ప్రచారం జరుగుతుందన్న విషయం తెలిసిందే.. ఇలాంటి పరిస్దితుల్లో దయకర్ రావు మాట్లాడిన ఈ మాటల వెనక ఆంతర్యం ఏమిటో అతనికే తెలియాలి అంటున్నారు కొందరు….