హరీశ్ రావు, మెదక్ ఎంపీ అభ్యర్థికి తృటిలో తప్పిన ప్రమాదం.. ఫోటోలు

-


మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు, టీఆర్ఎస్ తరుపున మెదక్ నుంచి పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. హరీశ్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనంలో ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించాయి. వాళ్లు తూప్రాన్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ప్రచార రథానికి మంటలు వ్యాపించడంతో వెంటనే వాళ్లు కిందికి దిగారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే స్పందించిన స్థానికులు ప్రచార రథానికి అంటుకున్న మంటలు ఆపివేశారు. దానికి సంబంధించిన ఫోటోలు ఇవే.

Read more RELATED
Recommended to you

Exit mobile version