పండిత పుత్రః పరమ శుంఠః…. ఈ సామెత వర్తించేవాళ్లు ప్రపంచంలో చాలామందే ఉంటారు. శుంఠ అంటే.. అవివేకి… లేదా సింపుల్‌గా మొద్దు అని అర్థం. మనం మాట్లాడుకోబోయే మహానుభావుడికి పై సామెత నిజానికి సరిపోదు. కానీ, అంతకంటే హీనమైన సామెత దొరక్క, వాడాల్సివచ్చింది. తెలుగు భాషాభిమానులైన పాఠకులకు, ఇది చదివిన తర్వాత ఇంకేదైనా తడితే దాన్నే అన్వయించుకోండి.
తెలుగుజాతి గర్వించదగ్గ మహానటులు, స్వర్గీయ శ్రీ ఎన్‌టి రామారావు తన అద్భుతనటనాపటిమతో, వాగ్ధాటితో సమస్త భారతావనిని ఎంత రంజింపజేసారో మనకందరికీ తెలుసు. నవరసాలు ఒలికించిన పాత్రలెన్నో నభూతో..అన్న స్థాయిలో నటించి, ప్రతిఇంటికి దైవసమానుడయ్యారు. అంత ఏకాగ్రతతో, చిత్తశుద్ధితో ఆ యా పాత్రలు పోషించగలగడమంటే అంతో ఇంతో దైవాంశ ఉంటే తప్ప సాధ్యం కాదు. మరి అంతటి మహోన్నత వ్యక్తిత్వానికి ఎటువంటి సంతానం ఉండిఉండాలి.? తన ఘన వారసత్వాన్ని జగమంతా జేజేలు పలికేలా ఉజ్వలంగా కొనసాగించాలి. కానీ.. జరిగిందేమిటి.? ఏ ఒక్క పోలికాలేని సంతానం జన్మించింది. ఎంతో నిష్టగా, క్రమశిక్షణతో ఉండే రామారావుగారి అలవాట్లు, లక్షణాలు, వ్యక్తిత్వం ఏ ఒక్కరికీ అబ్బలేదు. కనీసం సొంతంగా ఆలోచించే కారెక్టరే లేదు. పుట్టుకతోనే నోట్లో బంగారుచెంచాతో పుట్టారు కాబట్టి, ఆ అవసరం కూడా రాలేదు. కానీ ఇంట్లో అందరూ ఎంతో గౌరవించే, భయపడే, ఇష్టపడే నిండైన విగ్రహం తిరుగుతున్నప్పుడు కొన్నైనా అబ్బిఉండాలి. ప్చ్… అయితే ప్రజాజీవితంలో లేని కొందరు పిల్లలు ఎలా ఉంటారో తెలియదు గానీ, తెలిసినవాళ్లు మాత్రం తేడానే. మిగతావాళ్ల సంగతి ఎలా ఉన్నా, ముఖ్యంగా చెప్పుకోవలసిందీ, ఈనాటి మన కథానాయకుడు, ఎన్టీఆర్ నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నానని చెప్పుకునే నట ‘సింహం’ (భయపడకండి.. చంపుతుంది కానీ, తినదు), రాజకీయ వారసత్వం కూడా నాదేననే హిందూపుర గ్రామ సింహం, ఏ స్టేజ్ మీదనైనా చీఫ్ కమెడియన్… మన నందమూరి బాలకృష్ణ గురించి.
దశాబ్దాలుగా, తెలుగుప్రజలు తన నటనావైదుష్యానికి వాంతులు చేసుకుంటున్నా, అరిచే అరుపులకు చెవులు తూట్లుపడుతున్నా, సిక్స్‌టీస్‌లో సిక్స్‌టీన్‌తో ఎగురుతున్నా.. మనోడికి అదేం పట్టదు. చరిత్ర సృష్టించాలన్నా మేమే-దాన్ని తిరగరాయాలన్నా మేమే అంటూ ప్రతీ మాటకు, ప్రతీ చేష్టకు పెద్దాయన పరువు తీస్తుంటాడు. ఆయన గొంతులో మార్దవం.. ఈయన గొంతులో గార్దభం. కొడుకు మరీ ఇలా ఎలా.? తండ్రి పోలికల్లో ఒక్కటీ తెచ్చుకోలేదుగానీ, తన జన్మతా ఉత్తమ పురుష లక్షణాలు మాత్రం మేనల్లుడికి(సొంతల్లుడు కూడా) పుష్కలంగా ధారపోసాడు. అతిభయంకరమైన అహంకారానికి, పొగరుకు ఆకారంగా మిగిలాడు. హరికృష్ణ చనిపోతే మామ సంబరాశ్చర్యాలకు గురవుతాడు. వివేకానందరెడ్డి చనిపోతే అల్లుడు పరవశించిపోతాడు.
ఏ విషయంమీదనైనా, ఏదీ తెలియకపోవడం ఆయనకున్న ప్రత్యేకత పాపం. ఎమ్మెల్యే, నియోజకవర్గం, హిందూపురం, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, శాసనసభ, ఆస్కార్ అవార్డు, ఐటీ, సారే జహాసే అచ్ఛా…. ఇలా చాలా పదాలు ఆయనకు అరబిక్‌లో ఉంటాయి. తెలిసిందల్లా…
బావ చెప్తే..సరే..!
విషాదమేమిటంటే, తన వీరోచిత ప్రదర్శనలను జనాలు వినోదంగా పరిగణిస్తున్నారని, తనని బికె పాల్ అని పిలుస్తున్నారని తెలిసినా ఏమాత్రం తగ్గడు. మా వంశం – మా రక్తం అని మాట్లాడే అర్హతేలేని వంశోద్ధారకుడు బాలయ్య. కోట్లాదిమంది ప్రజలు తండ్రిని వేనోళ్ల కీర్తిసూంటే, కనీసం ఆయన మనసును అర్థం చేసుకోలేని ఈ సంతానం…. ‘అప్పట్లో…మరి… మా నాన్నగారూ…మరి’ అని ఆయనను అసందర్భంగా వాడుకుంటారు. ‘అపుత్రస్య గతిర్నాస్తి’ అనే ఆర్యోక్తి, ఎన్టీఆర్ విషయంలో ‘సపుత్రస్య గతిర్నాస్తి’గా మారిపోయింది. రారాజులా,దేవుడిలా వెలిగిపోయిన ఆయన్ను చివరిరోజుల్లో ఇంట్లోంచి వెళ్లగొట్టి, ఎంత హీనంగా చూసారో తెలుగు ప్రజానీకం అంతా కన్నీళ్ల గుండా చూసింది. జిత్తులమారి బావ వలలో పడి, అంతా వెన్నెముకలేనివాళ్లుగా చరిత్రలో మిగిలిపోయారు. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు. అప్పుడు బతికున్న సంతానమంతా దోషులే. ఇప్పుడు మిగిలినవాళ్లంతా శాపగ్రస్తులే. ఒకప్పుడు ఇక్కడ తప్పులు చేస్తే, పైన శిక్షలు అనేవారు. ఇప్పుడు దేవుడు కూడా ట్రెండ్ మార్చాడు. ఇక్కడి తప్పులకు శిక్ష కూడా ఇక్కడే. చంద్రబాబుకూ ఇక్కడే, బాల్‌బాబుకూ ఇక్కడే.
మనిషన్న ప్రతీవాడు ఎప్పుడో ఒకప్పుడన్నా తన వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనను విశ్లేషించుకుంటాడు. చేసిన తప్పులపట్ల కనీసం మనసులోనైనా పశ్చాత్తాపపడతాడు. కానీ, అవతలివాడి మొహంలోనే అసహ్యం, కోపం, బాధ కనిపిస్తున్నా తొణక్కుండా హింసిస్తూ అనందించేవాడికి తనకి తనో మోనార్క్‌లా కనిపిస్తాడు. పశ్చాత్తాపమనేది ఒక నీచలక్షణంగా పరిగణిస్తాడు. ఆ మోనార్కే ఈ బాలయ్య.
కింద పనిచేసేవాడు చెప్పులు సరిగా తొడక్కపోతే, చెంప చెల్లుమనిపిస్తాడు.. నో పోలీస్..!
ఎక్కడో ఓ పాపాభిమాని సెల్లులో ఫోటో తీస్తే.. వాడి దవడ పేలిపోతుంది.. అప్పుడూ..నో పోలీస్.
నిన్నగాక మొన్న, ఓ రిపోర్టర్ విడియో తీస్తుంటే, బూతులు.. బాంబులేస్తాడు, నరికేస్తాడు.. ఇప్పుడూ నో పోలీస్.
ఇవాళే, కొద్దిసేపటి క్రితం హిందూపురంలో చెరువుకు నీళ్లడిగినందుకు టిడిపి కార్యకర్తనే కొట్టాడు. ఆ అబ్బాయి దెబ్బకు రాజీనామా చేసి వెళ్లిపోయాడు.
కరెక్టుగా చట్టం-న్యాయం పనిచేసుంటే, ఇప్పటిదాకా చిప్పకూడే.
ఇంటి.నెం. 1355. ఆరోజు, ఆ ఇంట్లో ఏం జరిగిందో కొందరికే తెలుసు. ఆ కొందరివల్ల అందరికీ తెలుసు. పాపం.. దివంగత రాజశేఖరరెడ్డి దయవల్ల ఇంకా బయటే ఉన్నాడు. బావ దయవల్ల ఇంకా బతికేఉన్నాడు.
ఎన్నికలు వచ్చినప్పుడల్లా అందరికి (వాళ్ల పార్టీవారికే) ఓ భయం. ఈయన ప్రచారానికొచ్చి ఏం మాట్లాడుతాడో, ఎలా మాట్లాడుతాడోనని. మొన్న తెలంగాణ ఎన్నికల్లో ఈయనగారి విశ్వరూపాన్ని హైదరాబాద్‌లో బీభత్సంగా ప్రదర్శించాడు. బావగారొచ్చి, ఇది నాదే, అది నాదే, మీరంతా నాకు రుణపడిఉండాలి, పొద్దున్నే దండేసి దండమెట్టుకోవాలి అంటే, బావమరిదొచ్చి, తెలంగాణోళ్లకు ఐటీ తెలియదు, హైటెక్ సిటీ తెలియదు, పంట తెలియదు, వంటా తెలీదు, అన్నీ మేమే, అంతా మేమే… ఏ బుల్‌బుల్ అంటాడు.
ఒక ప్రముఖ పత్రికాసంపాదకుడన్నట్లు, బాలకృష్ణ అజ్ఞానానికి, మూర్ఖత్వానికి పరాకాష్ట.
సభ్యసమాజంలో ఇటువంటివారికి నిజానికి స్థానం ఉండకూడదు. కానీ వందేళ్లుగా వర్థిల్లుతున్న ప్రజాస్వామ్యం వీరికి కూడా స్వేచ్ఛను ప్రసాదించింది. ఇంతకాలం తనను భరిస్తున్నందుకు తెలుగు ప్రేక్షకులకు, ఓటేస్తున్నందుకు హిందూపురం పౌరులకు బాలయ్య రుణపడిఉండాలి. కానీ, ఎంతో కృతజ్ఞత చూపాల్సింది మాత్రం కూతురు బ్రహ్మణికే. ఎందుకో మళ్లీ అందరికీ తెలుసు.
-రుద్రప్రతాప్