జగన్ కి మోడీ గుడ్ న్యూస్…!

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్ట్ నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గత కొంత కాలంగా పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న నరేంద్ర మోడీ సర్కార్ ఇప్పుడు ఒక అడుగు ముందుకి వేస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్టులో భూసేకరణ, పునరావాస వ్యయాన్ని కూడా భరించేందుకు మోడీ సర్కార్ ముందుకి వచ్చింది.

ఇన్నాళ్ళు ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తో పాటుగా ప్రజలకు కూడా స్పష్టత లేదు. దీనితో ప్రాజెక్ట్ ముందుకి సాగుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయం తో జగన్ పెట్టుకున్న టార్గెట్ పూర్తి అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. 2021 నాటికి పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేసే విధంగా జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చేసారు.

నిధుల కొరత నేపధ్యంలో అది ముందుకి సాగుతుందా లేదా అనే చర్చ జరిగింది. నిధులు లేకుండా ఏ విధంగా ఆయన హామీ ఇచ్చారు అనేది ఎవరికి అర్ధం కాలేదు. కాని కేంద్రం ఇచ్చిన హామీ తోనే జగన్ ఈ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని తాజా పరిణామం తో అర్ధమైంది. పోలవరం ప్రాజెక్టు అంచనావ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూ.55,545 కోట్లకు సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిధుల్లో రూ.48వేల కోట్లు భరించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ కోసం సుమారుగా రూ.16,000 కోట్లు ఖర్చు పెట్టింది. సవరించిన అంచనాలు, కేంద్రం ఆమోదం తెలిపిన ప్రకారం మరో రూ.32వేల కోట్లు కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. భూసేకరణ, పునరావాల పనులకు రూ.27వేల కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందని అంచనా వేసారు. అంచనా. మరో రూ.5వేల కోట్లు ప్రాజెక్టు ఇంజినీరింగ్ కోసం ఖర్చు చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version