ప్రధానిగా మోదీ ప్రమాణం.. కేబినెట్ మంత్రులు వీరే..!

-

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మోదీ మరోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. గత కొంత సేపటి క్రితమే రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మోదీ ప్రధానిగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మోదీచే ప్రమాణం చేయించారు.

ఇక ఈ కార్యక్రమంలోనే మ‌రికొంత‌ మంది ఎంపీలు మంత్రులుగా ప్రమాణం చేశారు. కాగా ఈ కార్యక్రమానికి దేశ విదేశాలకు చెందిన సుమారు 6వేల మంది అతిథులు రాగా, వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా పలు వెరైటీ వంటకాలతో విందును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ప్రత్యేక ఆహ్వానితులు, రాష్ర్టాల ముఖ్యమంత్రులు, సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులతో రాష్ట్రపతి భవన్ అంతా సందడిగా మారింది. కాగా మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తుండగా ఆయన తల్లి హీరాబెన్ అహ్మదాబాద్‌లోని తన నివాసంలో టీవీలో ఆ దృశ్యాలను వీక్షించారు. చప్పట్లు కొడుతూ ఆనందం వ్యక్తం చేశారు.

మోదీ కేబినెట్‌లో మంత్రులుగా ప్రమాణం చేసింది వీరే..!

1. రాజ్‌నాథ్ సింగ్
2. అమిత్‌షా
3. నితిన్ గడ్కరీ
4. సదానంద గౌడ
5. నిర్మలా సీతారామన్
6. కిష‌న్ రెడ్డి
7. రాంవిలాస్ పాశ్వాన్
8. నరేంద్ర సింగ్ తోమర్
9. రవిశంకర్ ప్రసాద్
10. హరిసిమ్రత్ కౌర్ బాదల్
11. థావర్ చంద్ గెహ్లాట్
12. సుబ్రహ్మణ్యం జయశంకర్
13. రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ (ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి)
14. అర్జున్ ముండా (జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి)
15. స్మృతి ఇరానీ
16. డాక్టర్ హర్షవర్ధన్
17. ప్రకాష్ జవదేకర్
18. పీయూష్ గోయల్
19. ధర్మేంద్ర ప్రదాన్
20. ముక్తార్ అబ్బాస్ నఖ్వీ
21. ప్రహ్లాద్ జోషి
22. మహేంద్ర నాథ్ పాండే
23. డాక్టర్ అరవింద్ సావంత్
24. గిరిరాజ్ సింగ్
25. గజేంద్ర సింగ్ షెకావత్
26. సంతోష్ కుమార్ గాంగ్వర్
27. రావ్ ఇంద్రజిత్ సింగ్
28. శ్రీపాద్ య‌శో నాయక్
29. డాక్టర్ జితేంద్ర సింగ్
30. కిరణ్ రిజుజు
31. ప్రహ్లాద్ సింగ్ పటేల్
32. రాజ్‌కుమార్‌ సింగ్‌
33. హర్‌దీప్‌ సింగ్‌ పూరి
34. మన్‌సుఖ్‌ మాండవియా
35. కులస్తే
36. అశ్వినీకుమార్‌ చౌబే
37. అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌
38. వీకే సింగ్‌
39. కృష్ణపాల్‌
40. పురుషోత్తమ్‌ రూపాలా
41. రాందాస్ అథవాలే
42. కృషన్‌ పాల్‌ గుర్జార్‌
43. సాథ్వి నిరంజన్ జ్యోతి
44. సంజీవ్ బల్యాన్

Read more RELATED
Recommended to you

Exit mobile version