ఇదివరకు కూడా మోహన్ బాబు రాజకీయాల్లోకి దిగుతున్నారని… వైసీపీలో చేరుతారని పుకార్లు వినిపించాయి. ఆయన కొడుకు మంచు మనోజ్ కు కూడా రాజకీయాలంటే ఆసక్తి అని… ఇద్దరు కలిసి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని అనుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి
అనుకున్నట్టే జరిగింది. మనలోకం.కామ్ వెబ్ సైట్ ఏదైతే చెబుతుందో.. అదే జరుగుతోంది. ఇప్పటి వరకు మనోలోకం చెప్పినట్టుగానే… టీడీపీ నుంచి చాలామంది ప్రముఖులు వైసీపీలో చేరారు. తాజాగా మోహన్ బాబు కూడా వైసీపీలో చేరుతారని మనలోకం చెప్పింది.
మనలోకం చెప్పినట్టుగానే.. సినీనటుడు మోహన్ బాబు ఇవాళ వైఎస్సార్సీపీలో చేరారు. లోటస్ పాండ్ లో ఆయన ఇవాళ వైఎస్ జగన్ ను కలిశారు. ఈసందర్భంగా ఆయన వైసీపీలో చేరారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్.. మోహన్ బాబుకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
వైసీపీకి సినీ గ్లామర్ కూడా తోడవుతోంది. ఇప్పటికే వైసీపీలో రోజా, అలీ, రాజారవీంద్ర లాంటి సినీనటులు ఉన్నారు. తాజాగా మోహన్ బాబు కూడా చేరడంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వీళ్లు ప్లస్ అవుతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే.. మోహన్ బాబుకు రాజ్యసభ పదవి ఇప్పించి ఢిల్లీకి పంపించాలని జగన్ అలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
వైయస్ జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు. కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన వైయస్ జగన్#APNeedsYSJagan #VoteForFan pic.twitter.com/FgLvP2rhXt
— YSR Congress Party (@YSRCParty) March 26, 2019