సినీ నటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం కేసులో తెలంగాణ మంత్రి కొండా సురేఖ గురువారం ఉదయం నాంపల్లి స్పెషల్ కోర్టుకు హాజరయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను విమర్శించే క్రమంలో కొండా సురేఖ కేటీఆర్‌తో పాటు నాగార్జున కుటుంబంపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సమంత, నాగచైతన్య విడిపోవడానికి కేటీఆర్ కారణమని, దీనికి తోడు కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యలు కూడా చేశారు.
మంత్రి వ్యాఖ్యలను ఖండించిన నాగార్జున, కేటీఆర్‌లు వేర్వేరుగా మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దాఖలు వేశారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు తన కుటుంబాన్ని ఎంతగానో బాధించాయని..సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా ఎంతో గౌరవంగా ఉంటున్న తమ లాంటివారిపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయటం సరికాదని, తమ పరువుకు భంగం కలిగిందని నాగార్జున తన పిటిషన్‌లో పేర్కొనగా.. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కేసు విషయంలోనే ఆమె నాంపల్లి స్పెషల్ జడ్జి ఎదుట విచారణకు హాజరయ్యారు.