గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి గల కారణాలను మాజీ సీఎం, పార్టీ అధినేత వైఎస్ జగన్ వెల్లడించారు. కూటమిలోని పార్టీల వలే వైసీపీ అబద్ధాలు చెప్పకపోవడం వల్లే ఎన్నికల్లో ఓడిపోయామని జగన్ పేర్కొన్నారు. బుధవారం కార్యకర్తలతో నిర్వహించిన భేటీలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రజల బాగోగులు చూసి ఇన్ని బటన్లు నొక్కిన మన పరిస్థితే ఇలా ఉంటే, ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన కూటమి సర్కార్ పరిస్థితి రేపు ఎలా ఉంటుందో ఊహించుకోవాలని కోరారు. టీడీపీ నేతలు గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితులు లేవని, రాబోయేది జగన్ 2.0 ప్రభుత్వమేనని.. మరో 25 నుంచి 30 ఏళ్లు వైసీపీ అధికారంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తప్పు చేసిన వారిని వదలబోమని మాజీ సీఎం జగన్ స్పష్టం చేశారు.