నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న పోలింగ్ తీరుపై టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత అసంతృప్తి చేశారు. జిల్లాలోని పోతంగల్ లో ఈవీఎంలు సరిగ్గా పని చేయడం లేదని.. అవి మొరాయిస్తున్నాయిని.. ఎన్నికల అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు.
కవిత కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం కనీసం 40 నిమిషాల పాటు క్యూలో నిలబడాల్సి వచ్చింది. పోలింగ్ సిబ్బంది కూడా సరిగ్గా స్పందించడం లేదని ఆమె మండిపడ్డారు. కొన్ని చోట్ల కొన్ని పార్టీలు ఇచ్చిన ఓటర్ స్లిప్పులను పోలింగ్ అధికారులు అనుమతించడం లేదు. దీంతో ఓటర్లు వెనుదిరిగి మళ్లీ ఓటర్ స్లిప్పులను తీసుకెళ్లి ఓటేస్తున్నారు.