రిజల్ట్స్ రాకముందే మునిసిపల్ ఎన్నికల్లో టి‌ఆర్‌ఎస్ టాప్ అని తేలిపోయింది ?

-

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజారిటీ స్థానాలు గెలవడం గ్యారెంటీ అన్నట్లు చాలా సర్వే లెక్కలు చెబుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వినియోగించుకోవడంలో టిఆర్ఎస్ పార్టీ చాలా సఫలం అయినట్లు డిజిటల్ స్థాయిలో మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలను ప్రచారంలో అన్ని పార్టీల కంటే ఎక్కువగా ప్రజల పల్స్ తెలుసుకోవడంలో దూసుకు పోయినట్లు ఎక్కువ ఓట్లు టిఆర్ఎస్ పార్టీకే పడినట్లు రిజల్ట్స్ రాకముందే పోలింగ్ అయిపోయిన వెంటనే ఎక్కువ వార్తలు టిఆర్ఎస్ టాప్ అనే టాక్ గట్టిగా వినబడుతుంది.

ముఖ్యంగా మున్సిపాలిటీలు మరియు అదే విధంగా కార్పొరేషన్లలో టిఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడిన అభ్యర్థులు  వార్డులవారీగా వాట్సప్‌ గ్రూప్‌లు ఏర్పాటుచేసుకొని, తమను గెలిపిస్తే ఏం చేయగలమో నేరుగా ఓటర్లకు క్లారిటీ ఇచ్చే విధంగా ప్రచారం చేయడంతో పాటు పార్టీకి సంబంధించిన నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రచారం చేసిన ఫోటోలను వీడియోలను గ్రూపుల్లో వాయిస్ రికార్డు ల రూపంలో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియా ప్రచారంలో టిఆర్ఎస్ పార్టీ హవా కొనసాగినట్లు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీల కంటే ముందున్నట్లు ముఖ్యంగా మొత్తం 130 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో, 16 లక్షల మంది కార్యకర్తలున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేర్చడంలో చాలా సక్సెస్ అయినట్లు వార్తలు వినబడుతున్నాయి. ఏది ఏమైనా టిఆర్ఎస్ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్ లో తన సత్తా చాటి నట్లు తెలంగాణ రాజకీయాల్లో వార్తలు గట్టిగా వినబడుతున్నాయి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version