మైనంపల్లి కాన్ఫిడెన్స్ అదే..వారసుడు గెలుస్తాడా?

-

మొత్తానికి మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ లో చేరిపోయారు. బి‌ఆర్‌ఎస్ లో సీటు వచ్చినా సరే..తన తనయుడుకు సీటు రాలేదని చెప్పి ఆయన బి‌ఆర్‌ఎస్‌ని వదిలి కాంగ్రెస్ లోకి వచ్చారు. కాంగ్రెస్ లో రెండు సీట్లు ఫిక్స్ అయ్యాయని తెలుస్తోంది. తనకు మల్కాజిగిరి, తన తనయుడు రోహిత్‌కు మెదక్ అసెంబ్లీ సీటు ఫిక్స్ అని తెలుస్తోంది. దీంతో మైనంపల్లి తన పట్టు నిలుపుకున్నారని చెప్పవచ్చు.

కానీ ఇప్పుడు అసలు గేమ్ మొదలవుతుంది. బి‌ఆర్‌ఎస్‌ని వదిలి వచ్చిన మైనంపల్లికి..ఇప్పుడు రెండు సీట్లలో గెలవాల్సిన బాధ్యత ఉంది. అయితే రెండు చోట్ల గెలుపు అంత ఈజీ కాదు. మామూలుగా మల్కాజిగిరిలో బి‌ఆర్‌ఎస్‌కు పట్టు ఎక్కువ. పైగా అక్కడ బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధిగా మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డిని ఫిక్స్ చేసే ఛాన్స్ ఉంది. దీంతో మరింత రసవత్తరంగా ఉంటుంది. మల్కాజిగిరిలో బి‌ఆర్‌ఎస్ బలమైన పార్టీ..అయితే మైనంపల్లికి సెపరేట్ ఫాలోయింగ్ ఉంది. దీని వల్ల బి‌ఆర్‌ఎస్ బలం కాస్త తగ్గవచ్చు. అటు కాంగ్రెస్‌కు కొంత బలం ఉంది. అది కలిసిరావచ్చు.

కాకపోతే ఇక్కడ బి‌జే‌పికి కాస్త పట్టు ఉంది. దీని వల్ల ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉంది. దీంతో అక్కడ త్రిముఖ పోరు జరిగే ఛాన్స్ ఉంది. అంటే మల్కాజిగిరిలో మైనంపల్లి గెలుపు అంత సులువు కాదు. ఇక తన తనయుడు రోహిత్ మెదక్ బరిలో ఉంటారు. 2009లో టి‌డి‌పి నుంచి మైనంపల్లి అక్కడ నుంచే గెలిచారు.

దీంతో అక్కడ ఆయనకు పట్టు ఉంది. అలాగే కాంగ్రెస్ కేడర్ కలిసొస్తుంది. ఇటు బి‌ఆర్‌ఎస్ బలమైన పార్టీ. కాకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి పెద్దగా సానుకూల పవనాలు లేవు. అయినా సరే పార్టీ కేడర్ బలంగా ఉంది. దీంతో ఇక్కడ కూడా మైనంపల్లి వారసుడు గెలుపు సులువు కాదు. మొత్తానికి తండ్రి-కొడుకు ఈ సారి గట్టి పోటీ ఎదురుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version