చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన నాగబాబు.. ఏమన్నారంటే?

-

ఈసారి జరిగిన ఎన్నికల్లో అటు చంద్రబాబు కానీ.. ఇటు జనసేన కానీ గెలవలేకపోయాయి. ఘోరంగా ఓడిపోయాయి. దారుణాతి దారుణంగా రెండు పార్టీలు ఓటమిని చవి చూశాయి.

చంద్రబాబు, నాగబాబు.. ప్రత్యక్షంగా వీళ్లిద్దరి మధ్య ఏ బంధం లేదూ. కానీ.. ఏపీ ఎన్నికల ముందు.. టీడీపీ, జనసేన ఒక్కటేనన్న ప్రచారం మాత్రం జోరుగా సాగింది. అప్పట్లో టీడీపీకి చెందిన ఓ నేత కూడా జనసేన, టీడీపీ ఒక్కటేనని.. జనసేన పార్టీ.. టీడీపీ గెలుపు కోసమే ప్రయత్నిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే.. ఈసారి జరిగిన ఎన్నికల్లో అటు చంద్రబాబు కానీ.. ఇటు జనసేన కానీ గెలవలేకపోయాయి. ఘోరంగా ఓడిపోయాయి. దారుణాతి దారుణంగా రెండు పార్టీలు ఓటమిని చవి చూశాయి. ఏమో.. ఒకవేళ టీడీపీకి మెజారిటీ స్థానాలు వచ్చి.. జనసేనకు కూడా కొన్ని స్థానాలు వచ్చి.. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన సంఖ్యా బలం లేకుండా.. జనసేనను అడిగేది కావచ్చు.. బహుశా.. అందుకోసమే.. ఈ రెండు పార్టీల నడుమ రహస్య ఒప్పందం ఉండేదని ఎన్నికల సమయంలో అంతా అనుకున్నారు. సరే.. గతం గత: గతం గురించి మనకెందుకు కానీ.. తాజాగా జనసేన ఎంపీగా నరసాపురం నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయిన నాగబాబు.. చంద్రబాబుపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

తన ట్విట్టర్ వేదికగా చంద్రబాబుకు మద్దతు తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు. చంద్రబాబు మన ఎక్స్ సీఎం. ఇప్పుడు ఆయన ఓడిపోయినంత మాత్రాన ఆయన్ను దారుణంగా విమర్శించడం తప్పు. మనిషి పవర్ లో ఉండగా విమర్శించడం వేరు. ఓడిపోయాక విమర్శించడం చేతకానితనం. ప్రత్యర్థి నిరాయుధుడు అయి నిలబడితే వదిలేయాలి. అంతే కాని అవకాశం దొరికింది కదా అని ట్రోల్ చేయడం శాడిజం.. అంటూ ట్వీట్ వదిలారు నాగబాబు.

అబ్బ.. చంద్రబాబుకు నాగబాబు తోడయ్యాడు. భలేగా చంద్రబాబుకు మద్దతు ఇస్తున్నాడుగా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version