జనసేన పార్టీలో చేరే విషయంలో తప్పు చేశాననిపించింది.. నాగబాబు షాకింగ్ కామెంట్స్

-

జనసేన కోసం ఎటువంటి పనికైనా సిద్ధపడాలి. ఎంపీగా పోటీ చేయాలని అడిగే సరికి ఎందుకంత టైమ్ తీసుకున్నానో నాకే అర్థం కాలేదు. కానీ.. అది ఇప్పుడు తప్పుగా అనిపిస్తోంది. తమ్ముడు విషయంలో తప్పు చేశానని అనిపిస్తోంది.

మెగా బ్రదర్ నాగబాబు సడెన్ గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి.. నరసాపురం నుంచి జనసేన తరుపున ఎంపీగా పోటి చేసిన సంగతి తెలిసిందే కదా. అయితే.. ఎన్నికల తర్వాత మౌనంగా ఉన్న మెగా బ్రదర్ సడెన్ గా నోరు విప్పారు. అది కూడా షాకింగ్ కామెంట్స్ చేసి. అది కూడా తమ్ముడు పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి.

నిజానికి.. నాగబాబు రాజకీయాల్లోకి రావాలనుకోలేదు. పవన్ పార్టీ జనసేన కోసం వీడియోలు రూపొందించే పని పెట్టుకున్నారు. అయితే.. అనుకోకుండా ఎన్నికల్లో నిలబడ్డారు. ఈ విషయమై… అసలు.. రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలను నాగబాబు ఇటీవల వెల్లడించారు.

పవన్ కల్యాణ్ ఓ రోజు నాగబాబును పిలిచారట. నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తావా అన్నయ్యా? అని అడిగారట. అంత సడెన్ గా పవన్ అలా అడిగేసరికి ఏం చేయాలో అర్థం కాక… వెంటనే ఎస్ కానీ నో కానీ చెప్పలేక తనకు 12 గంటల సమయం కావాలని అడిగాడట నాగబాబు. తర్వాత ఉదయం ఫోన్ చేసి ఓకే చెప్పారట నాగబాబు.

ఆ విషయాన్ని ఇప్పుడు గుర్తు చేసుకున్న నాగబాబు.. తమ్ముడికి అంత సమయం కోరి చాలా పెద్ద తప్పు చేశానన్నారు నాగబాబు. అవును.. తమ్ముడు అడగ్గానే ఓకే అనాలి కానీ.. 12 గంటల సమయం కోరడమేంది. జనసేనలో చేరే విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశానని అనిపించింది.. అని నాగబాబు తెలిపారు.

జనసేన కోసం ఎటువంటి పనికైనా సిద్ధపడాలి. ఎంపీగా పోటీ చేయాలని అడిగే సరికి ఎందుకంత టైమ్ తీసుకున్నానో నాకే అర్థం కాలేదు. కానీ.. అది ఇప్పుడు తప్పుగా అనిపిస్తోంది. తమ్ముడు విషయంలో తప్పు చేశానని అనిపిస్తోంది. ఎంపీగా పోటీ అనగానే మొదటగా కాస్త భయమేసింది. ఆ భయంతోనే నా నిర్ణయాన్ని వెంటనే తమ్ముడికి చెప్పలేకపోయాను కానీ.. వేరే దేని గురించీ కాదు.. నరసాపురం ప్రజలు తనను ఎంతగానే ఆదరించారు. వారి అభిమానాన్ని నేను ఎప్పుడూ మరిచిపోలేను.. అని నాగబాబు అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version