అమరావతి: రాష్ట్రంలో బీజేపీ ఒక్క కార్పొరేటర్ స్థానం కూడా గెలిచే పరిస్థితి లేదని ఏపీ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని అన్నారు. నాలుగేళ్లైనా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామన్నారు. హోదా ఇవ్వకుండా ఏపీకి బీజేపీ వెన్నుపోటు పొడిచిందని లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. పటేల్ విగ్రహానికి 3వేల కోట్లు ఇచ్చిన కేంద్రం.. ఏపీ రాజధానికి రూ.1500 కోట్లే ఇచ్చిందన్నారు. ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు జగన్‌కి తితలీ బాధితులను పలకరించే సమయం లేదా అని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి సాయం చేసే మనసు కేంద్రానికి లేదని లోకేష్ విమర్శించారు.
రాష్ట్రంలో బిజేపీ నేతలు కార్పొరేటర్‌గా కూడా గెలవలేరు: నారా లోకేష్
-