జ‌గ‌న్ బంధువు అరెస్టు ? లోకేశ్ ఏమ‌న్నారంటే…

-

ఇసుక, అక్రమ మద్యం కాదేదీ అవినీతికి అనర్హం అంటూ జగన్ రెడ్డి గారు జనం డబ్బు దోచేస్తుంటే మేమేమైనా తక్కువ తిన్నామా అంటున్నారు ఆయన బంధువులు, పార్టీ నాయకులు. పులివెందులలో అభివృద్ధి పనులను నిర్వహిస్తున్న ఓ కన్ స్ట్రక్షన్ కంపెనీని బెదిరించి భారీ మొత్తంలో డబ్బులు గుంజ బోయాడు జగన్ రెడ్డి గారి సమీప బంధువు వైయస్ కొండారెడ్డి.

సీఎం గారి సొంత నియోజకవర్గంలోనే ఇంత దారుణమైన అవినీతి జరుగుతుంటే రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదు చేయని దందాలు ఎన్ని జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ప్రజల్ని, వ్యాపారుల్ని, కాంట్రాక్టర్లని పీడిస్తున్న వైసిపి నాయకులపై చర్యలు తీసుకోవాలి.

– నారా లోకేశ్, జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి తెలుగుదేశం పార్టీ

Read more RELATED
Recommended to you

Exit mobile version