జగన్ పై జాతీయ మీడియా ఫైర్…!

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా వైరస్ ని కట్టడి చేసే విషయంలో అనుసరిస్తున్న వ్యవహారశైలిపై ఇప్పుడు పలు రాష్ట్రాలు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. దేశం మొత్తం ఇప్పుడు ఉన్న పరిస్థితుల గురించి ఆందోళన లో ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏమాత్రం కూడా అది కనబడటం లేదు అని విమర్శలు ఎక్కువగా వినబడుతున్నాయి. కరోనా వైరస్ దెబ్బకు ఎన్నో దేశాలు ఆర్ధికంగా అతలాకుతలం అయిపోయాయి.

తమ పౌరుల ప్రాణాలను కాపాడుకోలేక ఇప్పుడు ఎన్నో దేశాల అధినేతలు కన్నీళ్లు పెట్టే పరిస్థితి వచ్చింది. కొంతమందికి నిద్ర కూడా లేదు. ఏకంగా ఒక ఆర్థిక మంత్రి ఐతే కరోనా దెబ్బకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా మనం చూశాం. ఇప్పుడు అలాంటి కరోనా వైరస్ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతున్న మాటలు పై జాతీయ మీడియా ఆగ్రహంగా ఉంది.

ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కరోనా వైరస్ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ జాతీయ మీడియా కథనాలు రాయడం ఇప్పుడు గమనార్హం. కరోనా వైరస్ ఒక సాధారణ డిసీజ్ అని సాధారణ వైరస్ లాంటిదే అని కేవలం జ్వరం వచ్చినపుడు తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటే అదే తగ్గిపోతుంది అని జగన్ మాట్లాడిన మాటలు పై జాతీయ మీడియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

అదేవిధంగా ఆయన మొన్నీ మధ్య మాట్లాడిన పారాసెటమాల్ కొరియా లో పుట్టింది అనే మాటలు కూడా జాతీయ మీడియా ఆగ్రహంగా ఉంది. ముందు నుంచి కూడా ఆయన వైఖరి విషయంలో జాతీయ మీడియా దృష్టి పెడుతూనే వస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్న తరుణంలో జగన్ ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు అంతర్జాతీయ మీడియా ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రాణాల విషయంలో కూడా జాతీయ మీడియా కొన్ని కథనాలు రాయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అక్కడ ఉన్న వైరస్ తీవ్రత జగన్ ఎంత మాత్రం అర్థం చేసుకోవడం లేదు అనే అనుమానాలను జాతీయ మీడియా తమ కథల్లో ఎక్కువగా ప్రస్తావిస్తూ వస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా చేసిన కార్యక్రమాలను అదేవిధంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకున్న నివారణ మార్గాలను ఇప్పుడు జాతీయ మీడియా ఫోకస్ చేసిందనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. రాష్ట్రంలో కేసుల మీద కూడా ఇప్పుడు జాతీయ మీడియా దృష్టి పెట్టింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version