మోడి vs కే‌సి‌ఆర్ – ఇది కదా రాజకీయం అంటే .. !

-

ప్రత్యేక తెలంగాణ సాధించి రెండు సార్లు కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. రెండోసారి జరిగిన ఎన్నికలలో అసెంబ్లీ స్థానాలలో భారీ స్థాయిలో విజయం సాధించారు. కానీ అదే సందర్భంలో 2019 లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ చేతిలో గట్టి దెబ్బ తిన్నారు కేసీఆర్. ఆ సమయంలో కెసిఆర్ తనయురాలు కవిత కూడా ఓడిపోవడంతో బిజెపి తెలంగాణ రాజకీయాల్లో కీలక శక్తిగా మారింది. దీంతో మెల్ల మెల్లగా బిజెపి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా టిఆర్ఎస్ పార్టీకి పక్కలో బల్లెంలా గా మారింది. ఈ సందర్భంలో బిజెపి పార్టీ నాయకులు ఏకంగా కేసీఆర్ ని టార్గెట్ చేసుకుని భయంకరమైన విమర్శలు మీడియా ముందే చేయడం జరిగింది.

ఇటువంటి తరుణంలో ముందు నుండి కెసిఆర్ జాతీయ రాజకీయాల్లో కీలకం కావాలని ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలో దేశం వెనుకబడి పోవటానికి కారణం జాతీయ పార్టీలని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఫెడరల్ ఫ్రంట్ అనే కూటమిని తెరపైకి తెచ్చారు. సరిగ్గా ఎన్నికలకు ముందు తన ప్రయత్నాలను ఆపేశారు. అనూహ్యంగా ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి పార్టీకి తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పి టిఆర్ఎస్ పార్టీకి ఎక్కువ మెజార్టీ స్థానాలు ఇవ్వటంతో కెసిఆర్ ఇప్పుడు మోడీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం.

 

దీనిలో భాగంగా మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సిఏఏ నిర్ణయాన్ని బేస్ చేసుకుని దేశంలో కొత్త కూటమి ఏర్పాటు చేయడానికి కేసీఆర్ రెడీ అవుతున్నాడని సమాచారం. జాతీయ రాజకీయాల్లో మోడీకి ప్రత్యామ్నాయంగా కెసిఆర్ త్వరలో అడుగుపెట్టబోతున్నాడు అని వార్తలు వస్తున్నాయి. కెసిఆర్ వెనకాల ప్రశాంత్ కిషోర్ కూడా ఉన్నట్లు ఇంకా వివిధ రాజకీయ పార్టీల నేతలు అంతా కలిసి మోడీని టార్గెట్ చేసి రాజకీయం చేయబోతున్నట్లు సమాచారం. మొత్తం మీద జాతీయ రాజకీయాల్లో కెసిఆర్… మోడీ వర్సెస్ కేసీఆర్ అన్న లైన్ లో అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా త్వరలో జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో మోడీ తీసుకున్న సిఏఏ నిర్ణయం రద్దు చేయడానికి కేసీఆర్ పూనుకున్నారు. దీంతో చాలామంది జాతీయస్థాయిలో ఉన్న ప్రముఖ రాజకీయ నాయకులు ఇది కదా రాజకీయం అంటూ కేసీఆర్ జాతీయ స్థాయిలో పొలిటికల్ ఎంట్రీ పై కామెంట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version