రవితేజ లాంటివాడు ప్రతి జనరేషన్​కి ఒకడుంటాడు : నాని

-

మాస్​మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం రామారావు ఆన్​ డ్యూటీ. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్​లో జరిగింది. ఆదివారం రోజు జరిగిన ఈ వేడుకకు నేచురల్ స్టార్ నాని చీఫ్ గెస్ట్​గా వచ్చారు.

“నేను సాధించాను.. మీరెందుకు సాధించలేరు’ అని ధైర్యాన్నిచ్చే వాడు ప్రతి జనరేషన్‌కీ ఒకడుంటాడు. కెరీర్‌ తొలినాళ్లలో మాకలాంటి ధైర్యాన్నిచ్చిన వ్యక్తి రవితేజ అన్న. ఈ వేడుకకు అతిథిగా రాలేదు. రవితేజ అన్న గురించి మాట్లాడే అవకాశం వచ్చిందని వచ్చా. తనకి చిరంజీవి అంటే చాలా ఇష్టం. ఆయన కెరీర్‌ మొదలు పెట్టినప్పుడు చిరుని స్ఫూర్తిగా తీసుకున్నారు. మేము కెరీర్‌ మొదలు పెట్టినప్పుడు మాకలాంటి స్ఫూర్తినిచ్చింది రవి అన్న. తను చిరంజీవి క్యారవ్యాన్‌లోకి వెళ్లిన సీన్‌ చూశా. త్వరలో నేనూ తన క్యారవాన్‌లోకి అలా అడుగు పెట్టాలనుకుంటున్నా.’ అని అన్నారు నాని.

.రవితేజ కథానాయకుడిగా శరత్‌ మండవ తెరకెక్కించిన చిత్రమిది. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. దివ్యాంశ కౌశిక్‌, రజిషా విజయన్‌ కథానాయికలు. ఈ సినిమా జులై 29న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version