లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా నాడిపై పలు సర్వే సంస్థలు ఫలితాలను వెల్లడిస్తున్నాయి.ఈ ఎన్నికల్లో ఎవరివైపు ఓటర్లు నిలుస్తున్నారన్న అంశంపై అనేక సంస్థలు సర్వేలను వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్‌డిటీవి పోల్ సర్వే కూడా ఏపీ ప్రజల అభిప్రాయాలను సేకరించింది. ఇందులో మెజారిటీ ఓటర్లు వైసీపీ వైపే చూస్తున్నారు. ఈ సర్వే ప్రకారం అత్యధిక మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కట్టబెడుతున్నారు. అంతే కాదు ఈ సర్వేలో సంచలన విషయాలను ఓటర్లు వెల్లడించారు.సంక్షేమ పథకాలను గడపకే చేరవేసిన సీఎం జగన్మోహన్‌రెడ్డి మరోసారి సీఎం కావాలని అత్యధిక మంది కోరుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 25 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. వీటిలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 16 ఎంపీ సీట్లను కైవలసం చేసుకోబోతోంది.మిగతా 9 సీట్లు ఎన్డీఏ కూటమి ఖాతాలో పడనున్నాయి. ఈ లెక్కన 110 నుంచి 120 ఎమ్మెల్యే స్థానాలను వైసీపీ గెలుచుకోనుందని ఎన్‌డిటివి పోల్ సర్వే స్పష్టం చేసింది.
ఇక ఎన్‌డిఏ కూటమి 40 స్థానాలను గెలుచుకుంటుందని మరో 25 స్థానాల్లో టైట్ ఫైట్ నడుస్తోందని తేల్చేసింది. టైట్ ఫైట్ నడిచే వాటిల్లో కూడా వైసీపీ అభ్యర్ధులే ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తారని తెలుస్తోంది.వరుసగా రెండో సారి ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ఎన్‌డిటివి స్పష్టం చేసింది.దీంతో వైసీపీ శ్రేణులు ఫుల్ జోష్‌లో ఉన్నాయి.
పదికిపైగా సర్వే సంస్థలు ఆంధ్ర ప్రదేశ్‌లో పోల్ సర్వేలు నిర్వహించాయి. అయితే ఇందులో మెజారిటీ సర్వేలు వైసీపీకే అనుకయూల ఫలితాలను ఇచ్చాయి. తాజాగా ఎన్‌డిటివి పోల్ సర్వే కూడా ఇవే ఫలితాలను స్పష్టం చేయడంతో ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇదిలా ఉండగా అన్ని రకాల సర్వేల్లో వైసీపీ గెలుస్తుందని తేలడంతో గెలిచాక ప్రమాణ స్వీకారం ఎక్కడ అనే అంశంపై వైసీపీలో తీవ్ర చర్చ జరుగుతోంది.
ఎన్నికలకు ముందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం వేదికగా మళ్ళీ సింగా ప్రమాణం చేస్తానని చెప్పారు. అటు ఉత్తరాంధ్ర ఓటర్లు కూడా సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి విశాఖ వేదిక కావాలని కోరుకుంటున్నారు. దీంతో విశాఖ పట్నం మరింతగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయని అశాభావం వ్యక్తపరుస్తున్నారు.