వైసీపీలో ఆ జిల్లా ఎందుకు సైలెంట్ అయినట్టు…?

-

ఈ మధ్యకాలంలో నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు కాస్త సైలెంట్ అయిపోయారు. దానికి ప్రధాన కారణం ఏమిటనేది తెలియదు కానీ చాలా మంది నెల్లూరు జిల్లా నేతలు మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. మంత్రులు ఎమ్మెల్యేలు గానీ పెద్దగా ఎవరూ మాట్లాడకపోవటంతో ఇప్పుడు అసలు వైసీపీ లో ఏం జరుగుతుంది ఏంటనేది అర్థం కావడం లేదు. తెలుగుదేశం పార్టీ నేతలు మీడియా ముందుకు వస్తున్నా సరే…

నెల్లూరు జిల్లాకు చెందిన నేతలు మాత్రం సైలెంట్ కావడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సన్నిహితంగా ఉన్న చాలా మంది నేతలు కూడా సైలెంట్ గా ఉంటున్నారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గాని మేకపాటి గౌతంరెడ్డి గానీ పెద్దగా మాట్లాడటం లేదు. పంచాయతీ ఎన్నికల్లో కూడా వీళ్ళు పెద్దగా మాట్లాడిన పరిస్థితి కనబడలేదు.

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్న సరే నెల్లూరు మున్సిపాలిటీ పరిధిలో ఎవరూ కూడా ప్రచారం చేసే ప్రయత్నం చేయడంలేదు. ఎమ్మెల్యేల మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. ఇటీవల మాజీ ఎంపీ ఇంట్లో కొంతమంది ఎమ్మెల్యేలు ఒక మంత్రి సమావేశమయ్యారని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. తెలుగుదేశం పార్టీ నేతలతో ఒక ఎమ్మెల్యే ఎక్కువ సమయం ఉంటున్నారనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. అసలు మిగిలిన వాళ్ళు అయినా సరే మీడియా ముందుకు ఎందుకు రావడం లేదో వైసీపీ నేతలకు కూడా అర్థం కావడం లేదు. పంచాయతీ ఎన్నికల్లో కూడా కార్యకర్తలకు ధైర్యం చెప్పే నేతలు పెద్దగా కనబడలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version