ఏపీలో రంగులపై కొత్త వివాదం…!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నా సరే రాజకీయం మాత్రం ఆగడం లేదు. రోజు రోజుకి ఏదోక అంశం మీద వివాద౦ చెలరేగుతూనే ఉంది. తాజాగా మరోసారి రంగుల వివాదం మొదలయింది. హైకోర్ట్ రంగులను మార్చాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. సుప్రీం కోర్ట్ కి వెళ్ళినా సరే ఫలితం లేకుండా పోయింది. ఈ తరుణంలో రంగులను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అయితే ఈ రంగులను పూర్తిగా తొలగించడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం హనుమాన్‌పాలెంలో ఓ పంచాయతీ ఆఫీస్‌కు పార్టీ రంగులు వచ్చేలా ఆకుపచ్చ, తెలుపు, నీలం రంగులను అలాగే ఉంచారని, పంచాయతీ ఆఫీస్‌ను రైతు భరోసా కేంద్రంగా మార్చి, ఆకుపచ్చ, తెల్ల, నీలం రంగులతో పాటు కొత్తగా కాషాయ రంగులను వేయిస్తున్నారు.

దీనికి రంగులను మార్చడం ఎందుకు అని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అటు జనసేన వాళ్ళు కూడా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజా మాట్లాడుతూ తెలుపు రంగు-క్షీర విప్లవం, నీలం రంగు – చేపల పెంపకం, ఆకుపచ్చ రంగు – వ్యవసాయానికి ప్రతీక అంటూ చెప్పారని, కానీ వైసీపీ రంగులను ప్రతిబింబించేలా ఆ రంగులు ఉన్నాయని ఆయన మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version