వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా.. ఏ ఫ్రంట్ కూడా అధికారం చేపట్టలేవని తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గరెడ్డి అన్నారు. దేశంలో ఎన్ని ఫ్రంట్ లు వచ్చినా.. ప్రభుత్వం ఏర్పాటు చేసిది మాత్రం కాంగ్రెస్ పార్టీనే అని జోస్యం చేప్పారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ బీజేపీ వైపు తుపాకీ ఎక్కు పెట్టి .. కాంగ్రెస్ పార్టీ నీ కాలుస్తున్నడని విమర్శించారు. చూసే వాళ్లకు తుపాకీ ఎక్కుపెట్టిన బీజేపీ వైపే కాలుస్తున్నాడని అనిపిస్తుందని అన్నారు.
కానీ ఆయన తూటలన్నీ కూడా కాంగ్రెస్ వైపే వస్తున్నాయని అన్నారు. కానీ కేసీఆర్ ఎన్ని రాజకీయ ఎత్తుగడలు వేసిన కాంగ్రెస్ ను ఏం చేయలేరని అన్నారు. కేసీఆర్ రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.. కానీ ప్రజ అవసరాలను గాలి వదిలేస్తున్నాడని విమర్శించారు. రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ ఎలా అన్నారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడింది కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే అని అన్నారు. అలాగే కేంద్ర బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు నిధుల కేటాయించకుండా అన్యాయం చేశారని అన్నారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి తో పాటు ముగ్గురు ఎంపీలు ఉన్నా.. ఉపయోగం లేదని అన్నారు.