చ‌నిపోయినా.. విద్యుత్ సంస్క‌ర‌ణ‌లను ఒప్పుకోను : సీఎం కేసీఆర్

-

కేంద్ర ప్ర‌భుత్వం దొంగ చాటున విద్యుత్ సంస్క‌ర‌ణ‌లను తీసుకువ‌స్తుంద‌ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ విమ‌ర్శించారు. తాను చ‌నిపోయినా.. తెలంగాణ రాష్ట్రంలోకి విద్యుత్ సంస్క‌ర‌ణ‌ల‌ను తీసుకురాన‌ని స్ప‌ష్టం చేశారు. అంతే కాకుండా ఆ సంస్క‌ర‌ణ‌ల‌కు ఎట్టి ప‌రిస్థితుల్లో కూడా అంగీక‌రించ‌న‌ని తెల్చి చెప్పారు. రాష్ట్రంలో ఏ ఒక్క బావికి కూడా మీట‌ర్ల‌ను పెట్ట‌మ‌ని అన్నారు. రైతుల‌కు న‌ష్టం చేయ‌డానికే కేంద్ర ప్ర‌భుత్వం ఈ విద్యుత్ చ‌ట్టాల‌ను తీసుకువ‌స్తంద‌ని విమ‌ర్శించారు.

తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌లు దొంగ పార్టీల‌ను దొంగ నాయ‌కుల‌ను గుర్తించాల‌ని అన్నారు. అంతే కాకుండా వారితో పోరాటం చేయాల‌ని పిలుపు నిచ్చారు. కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా అంద‌రూ క‌లిసి పోరాటం చేయాల‌ని అన్నారు. దేశంలో ప‌లు పార్టీల కూడా బీజేపీకి వ్య‌తిరేకంగా పోరాడ‌టానికి ముందుకు వ‌స్తున్నాయ‌ని అన్నారు. బెంగాల్ ముఖ్య‌మంత్రి మమ‌త బెనర్జీ కూడా త‌నకు ఫోన్ చేసింద‌ని అన్నారు. అలాగే త‌మిళ‌నాడు, మ‌హారాష్ట్ర ముఖ్య మంత్రులు కూడా ఇటీవ‌ల మాట్లాడ‌ర‌ని అన్నారు. దేశం మొత్తం తిరిగి మోడీ గురించి చెబుతాన‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news