రాష్ట్రాలు తమ వద్ద సౌర విద్యుతు కొనుగోలు చేయాలని బలవంతం చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కాగ ఇటీవల విద్యుత్ కొనుగోలు తో పాటు కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న విద్యుత్ సంస్కరణలను తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చనిపోయినా.. బావుల వద్ద మీటర్లు బిగించేదే లేదని పలుమార్లు స్పష్టం చేశారు. అలాగే ఇటీవల సీఎం కేసీఆర్ నిర్వహించిన ప్రెస్ మీట్ లో కూడా విద్యుతు కొనుగోలు, విద్యుత్ సంస్కరణలపై కేంద్ర ప్రభుత్వం పై ఘాటు విమర్శలు చేశారు.
ఈ విమర్శలపై తాజా గా కేంద్ర ప్రభుత్వం స్పందించింది. తాము సౌర విద్యుతు కొనుగోలు చేయాలని రాష్ట్రాలపై బలవంతం చేయడం లేదని స్పష్టం చేసింది. అలాగే వ్యవసాయ బావులకు మోటర్లను బిగించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడం లేదని తెలిపింది. సీఎం పదవిలో ఉన్న కేసీఆర్ ఇలాంటి అబద్ధాలను చెప్పడం సరైంది కాదని కేంద్ర ప్రభుత్వం పెర్కొంది.