జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న సంగతి తెలిసిందే. జనసేన బిజెపితో పొత్తు పెట్టుకున్న అనంతరం తొలిసారి పవన్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళడంతో ఎం జరుగుతుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. రాజకీయంగా ఏ సంచలనాలు జరుగుతాయి అనే దానిపై ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నాదెండ్ల మనోహర్‌తో కలిసి ఆయన బుధవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ నేతలతో,
పవన్ కీలక చర్చలు జరిపే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ముఖ్యంగా నరేంద్ర మోడీతో ఆయన భేటి అవుతారు అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. అదే విధంగా బిజెపి నూతన జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో కూడా పవన్ భేటి అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అలాగే హోం మంత్రి అమిత్ షా ని కూడా కలుస్తారు అనే వార్తలు ఇప్పుడు ఎక్కువగా వినపడుతున్నాయి.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొంటారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు పవన్ కళ్యాణ్ ని సంప్రదించాలని బిజెపి రాష్ట్ర నాయకత్వానికి అది నాయకత్వం చెప్పినట్టు చర్చ జరుగుతుంది. రాజధాని అంశం గురించి ఆయన మోడితో చర్చించే అవకాశం ఉందని అంటున్నారు.