భారతీయ జనతా పార్టీ విషయంలో పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ నేతలు కూడా తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పలేక ఇబ్బంది పడుతున్నారనే అభిప్రాయం చాలా వరకు వ్యక్తమవుతోంది. పవన్ కళ్యాణ్ ని దగ్గర చేసుకునే విషయంలో బీజేపీ ముందు నుంచి కూడా ఇబ్బందికరంగానే వ్యవహరిస్తుందనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి.
పవన్ కళ్యాణ్ విషయంలో కొన్ని రోజులుగా బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కూడా జరుగుతూ వస్తోంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కీలక నేతలతో త్వరలో అత్యవసర సమావేశం నిర్వహించే అవకాశాలు కనబడుతున్నాయి. అత్యవసర సమావేశం నిర్వహించి తిరుపతి ఉప ఎన్నికల్లో బిజెపి ప్రచారం చేయాలని చెప్పి ఆ తర్వాత బిజెపికి మనం గుడ్బై చెప్పే అవకాశం ఉందనే విషయాన్ని స్పష్టంగా చెప్పే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.
జనసేన పార్టీ నేతలు కూడా బీజేపీతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపించడం లేదు. తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి పని చేయడానికి ఒక రకంగా ఆసక్తికరంగానే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే విషయంలో ప్రతి అంశంలో కూడా బీజేపీ తమను ఇబ్బంది పెడుతోందనే భావనలో ఉన్న చాలామంది బీజేపీని వదిలించుకోవాలని పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి చేస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ అత్యవసర సమావేశం పెట్టి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.