పవన్..చూడమంటున్నారు..కానీ చేయమనడం లేదే..!

-

ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడుగా ముందుకెళుతున్నారు…గతం కంటే భిన్నంగా ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు. ముఖ్యంగా జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు…ఎక్కడకక్కడ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే…మరో వైపు జగన్ ప్రభుత్వం అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నారు. అసలు జగన్ ని గద్దె దించడమే లక్ష్యంగా పవన్ ముందుకెళుతున్నారు…అందుకోసం పొత్తు పెట్టుకోవడానికైనా రెడీ అంటున్నారు.

అయితే అంతా బాగానే ఉంది…పవన్ బాగానే కష్టపడుతున్నారు..కాకపోతే పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయడంలో పవన్ విఫలమవుతున్నారు. ప్రస్తుతం ఏపీలో జనసేన పెద్దగా బలం లేదు…అసలు ఆ పార్టీ సింగిల్ గా పోటీ చేసి 10 సీట్లు గెలుచుకునే కెపాసిటీలో లేదు. అయినా సరే తమ పార్టీని గెలిపించాలని పవన్ కోరుతున్నారు. తాజాగా ఉమ్మడి కడప జిల్లా పర్యటనకు వెళ్ళిన పవన్… ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాయలసీమను అభివృద్ధి చేస్తానని..ఒక్కసారి జనసేనను చూడండని కోరారు.

ఒకే ఒక్కసారి జనసేన వైపు చూసి.. తమను ఆశీర్వదించాలని అంటున్నారు. అంటే జనసేన వైపు చూడాలని ప్రజలని కోరుతున్నారు. కాకపోతే ఇక్కడ అర్ధం కాని విషయం ఏంటంటే…జనసేన వైపు చూడాలని అంటున్నారు గాని…తనని సీఎం చేయాలని మాత్రం కోరడం లేదు. జనసేన ప్రభుత్వం వస్తుందని అంటున్నారు గాని…సింగిల్ గాన, లేక పొత్తులోన అనేది చెప్పడం లేదు.

అసలు పవన్ మాటలు పూర్తిగా క్లారిటీ లేకుండా ఉన్నాయి…తనని సీఎం చేస్తే…రాష్ట్రాన్ని, రాయలసీమని అభివృద్ధి చేస్తానని చెప్పొచ్చు…కాని శీం అనే మాట మాత్రం పవన్ చెప్పడం లేదు. దీని బట్టి చూస్తే పవన్…టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఖాయమని, అలాగే గెలిస్తే చంద్రబాబు సీఎం అవ్వడం ఖాయమని అర్ధమవుతుంది. అయితే తన కోసం కాకుండా పవన్…చంద్రబాబు కోసం పోరాటం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయం ప్రజలకు అర్ధమైతే…జనసేనని ఆదరించడం కష్టమవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version