గత సార్వత్రిక ఎన్నికల్లో సరిగ్గా నెల రోజుల ముందు జనసేన పార్టీలో చేరారు నాగబాబు. నరసాపురం పార్లమెంట్ స్థానానికి పార్టీ తరఫున పోటీ చేసిన నాగబాబు ఓడిపోయాడు. దీంతో ప్రస్తుతం నాగబాబు వల్ల లాభమెంత.? నష్టమెంత.? అని జనసైనికులు బేరీజు వేసుకునే పరిస్థితి వచ్చింది. మెగా అభిమానుల్లో చాలా వరకు నాగబాబుపై కనబడని కోపం ఉంది. ఇది ఓపెన్ సీక్రెట్. చాలా సందర్భాలలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్న సమయంలో నాగబాబు అభిమానులపై సీరియస్ అయిన దాఖలాలు మరియు ఘటనలు కూడా ఉన్నాయి.
దీంతో ఈ ట్వీట్‌కి అనూహ్యంగా నెటిజన్లు తీవ్రంగా సీరియస్ అయ్యారు. జన సైనికులు కూడా ఇలాంటివి చేస్తే పార్టీపై వ్యతిరేకత వస్తుందని నాగబాబు మీద మండిపడ్డారు. దీంతో విషయం ముదరడంతో పవన్ కళ్యాణ్ తగలడంతో వెంటనే నాగబాబు కి ఫోన్ చేసి..వార్నింగ్ ఇవ్వటం జరిగిందట. ఇంకోసారి రిపీట్ అయితే వేరేలా ఉంటుంది అసలే ప్రజలు భయపడుతుంటే పిచ్చ పిచ్చ కామెంట్లు చేస్తావా..? అంటూ పవన్ సీరియస్ అయినట్లు జనసేన పార్టీలో టాక్.