వైసీపీపై పవన్ పోరు..ఇక మొదలుపెడదామా!

-

చాలా రోజుల తర్వాత పవన్ ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు..శ్రీకాకుళంలో యువతతో సభ తర్వాత..పవన్ ఏపీ రాజకీయాల్లో కాస్త యాక్టివ్ గా లేరు. సినిమాల్లో బిజీ అయ్యారు. కాకపోతే అడపాదడపా ప్రజా సమస్యలపై ఆయన సోషల్ మీడియా వేదికగా గళం విప్పుతున్నారు. అయితే ప్రత్యక్ష పోరుకు దిగి చాలా కాలం అవుతుంది. ఇక ఇప్పుడు జనసేన ఆవిర్భావ సభతో ఆయన మరొకసారి వైసీపీ పై విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయి.

ఈ నెల 11 నుంచి ఆయన యాక్టివ్ కానున్నారు.  11 నుంచి 14 వరకు రాజకీయ సమావేశాలు, కార్యకర్తలతో పవన్ భేటీ అవుతూ బిజీగా ఉండనున్నారు. 11న మంగళగిరిలో పార్టీ కార్యాలయానికి రానున్న పవన్.. ఆ రోజు బీసీ సంక్షేమంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు. 12న ఉదయం 11 గంటలకు పార్టీ రాష్ట్ర నాయకులతో సమీక్ష చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య నేతృత్వంలో కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో పవన్ భేటీ కానున్నారు.

13న ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల నిర్వహణపై సమీక్ష జరుపుతారు. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్‌తో పవన్ మర్యాదపూర్వకంగా కలువనున్నారు. 14వ తేదీన..మచిలీపట్నంలో జరగనున్న జనసేన ఆవిర్భావ సభలో పాల్గొంటారు. ఇక ఆవిర్భావ సభలో వైసీపీ ప్రభుత్వం టార్గెట్ గా ఆయన ఫైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వైసీపీ నేతలపై పంచ్ లు వేసే ఛాన్స్ ఉంది.

అదే సమయంలో ఆయన పొత్తులపై ఇంకా క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే బి‌జే‌పితో పెద్దగా కలిసి పనిచేయట్లేదు..టి‌డి‌పితో పొత్తు అంటే బి‌జే‌పి కలిసి రావట్లేదు. ఈ నేపథ్యంలో బి‌జేపిని లైట్ తీసుకుని టి‌డి‌పితో పొత్తుపై ఫుల్ క్లారిటీ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version