జనసేన: ఎన్నికల సమయం దగ్గర పడిపోతుంది…గట్టిగా చూసుకుంటే ఇంకా ఏపీలో ఎన్నికలకు ఏడాది సమయం కూడా లేదు.అటు జగన్, ఇటు చంద్రబాబు జనంలోకి వెళ్ళిపోయారు..టిడిపి, వైసీపీ నేతలు జనంలోనే తిరుగుతున్నారు. ఎవరికి వారు గెలుపే దిశగా వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకెళుతున్నారు. మరి ఇలా ఉన్న సమయంలో జనసేన అధినేత పవన్ మాత్రం ఎందుకు సైలెంట్ గా ఉన్నారు..ఇంకా పార్టీ బలంపై చర్యలు లేవు…ఇంకా చాలా స్థానాల్లో ఆ పార్టీకి బలమైన నాయకత్వం లేదు. ఇంకా ప్రజల్లోకి వెళ్ళడం లేదు.
ఈ పరిస్తితుల నేపథ్యంలో జనసేన కేడర్ లో కన్ఫ్యూజన్ ఉంది. అంటే పొత్తులు ఉన్నాయి కాబట్టి పవన్ సైలెంట్ గా ఉంటున్నారా అని డౌట్ ఉంది. ఒకవేళ పొత్తులు లేకపోతే ఇలా లైట్ తీసుకుంటే పార్టీకే దెబ్బ..మళ్ళీ పార్టీ విడిగా ఎన్నికల బరిలో దిగితే పట్టుమని పది సీట్లు గెలవలేదు. అసలు గత ఎన్నికల నుంచి జనసేనకు బలపడటానికి మంచి అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ అంశంపై పవన్ పెద్దగా ఫోకస్ పెట్టలేదు. ఏదో అప్పుడుప్పుడు రాష్ట్రానికి రావడం..మీటింగులు పెట్టి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం…మళ్ళీ హైదరాబాద్ కు వెళ్ళి సినిమా షూటింగుల్లో బిజీ అయిపోవడం.
అయితే సినిమాలు చేయడం తప్పేమీ కాదు..కానీ పార్టీని సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఇబ్బంది వస్తుంది. ఇక పవన్ బదులు నాదెండ్ల మనోహర్ రాష్ట్రమంతా తిరుగుతూ..పార్టీని లైన్ లో పెడుతున్నారు. కానీ అదే పవన్ డైరక్ట్ గా రంగంలోకి పనిచేస్తే జనసేన పరిస్తితి ఇప్పుడు ఇలా ఉండేది కాదు. ఇంకా బలోపేతం అయ్యేది.
ఏదో గత ఎన్నికల్లో పవన్ పై అభిమానం ఉన్నవారు..జగన్ కు ఓటు వేశారు. ఇప్పుడు వారు జగన్ పై వ్యతిరేకతతో జనసేన వైపుకు వస్తున్నారు. ఇక అలాంటి వారే తప్ప..జనసేనకంటూ ప్రతి నియోజకవర్గానికి బలమైన కేడర్ లేకుండా పోతుంది. అయితే పవన్ టిడిపితో పొత్తుకు రెడీ అయ్యి, చంద్రబాబుపైనే భారం వేసేసినట్లు కనిపిస్తుంది. అంటే ఈ ఎన్నికల్లో పొత్తుపైనే పవన్ బండి లాగించనున్నారు.