సుదీర్ఘ చర్చల అనంతరం కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఖరారు.. బొత్సను ఆయన ఢీకొంటారా..

-

విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని ఖరారు చేసేందుకు ఆ పార్టీ నేతలు ఇప్పటికి రెండుసార్లు భేటీ అయ్యారు.. అయితే వారి మధ్య ఏకాభిప్రాయం రాలేదు.. మొదట గండి బాబ్జి పేరు ప్రచారం జరిగినా.. ఆయన పోటీకి విముఖత చూపడంతో.. వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణకు దీటుగా ఉండే అభ్యర్థి కోసం కూటమినేతలు వేట ప్రారంభించారు..

విశాఖ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. దింతో బొత్స సత్యనారాయణను ఢీకొట్టాలంటే అంగబలం, ఆర్థిక బలంతో పాటు సామాజిక వర్గ సహకారం కూడా ఉండాలని భావించిన కూటమి నేతలు.. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వియ్యంకుడు పీలా గోవింద సత్యనారాయణ పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతుంది.. స్థానిక సంస్థల కోట ద్వారా జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు విశాఖ రూరల్ జిల్లాలోనే ఉన్నాయి.. ఈ క్రమంలో రూరల్ జిల్లాకు చెందిన పీలాను పోటీకి దింపితే.. విజయావకాశాలు మెండుగా ఉంటాయనే భావనలో కూటమి నేతలు ఉన్నారట..

బలమైన గవర సామాజిక వర్గానికి చెందిన నేతగా ఉన్న పీలాను బరిలోకి దింపితే బీసీ వర్గాలకు చెందిన నేతలందరూ సహకరిస్తారని కూటమినేతలు భావిస్తున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో గవరతో పాటు బీసీలు ఎక్కువగా ఉండడంతో.. వారంతా సహకారం అందిస్తారని.. అందుకే పీలా పేరును అధిష్టానానికి పంపామని టిడిపిలోని కీలక నేతలు చర్చించుకుంటున్నారు.. మరోపక్క బొత్స సత్యనారాయణ ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేస్తున్నారట.. ప్రజాప్రతినిధులు అందర్నీ కలుస్తూ మద్దతు కూడా కట్టుకుంటున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు.. మొత్తంగా విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రసవత్తరంగా ఉండబోతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version