పవన్ కోసం పేర్ని.. జ‌గ‌న్‌కు నష్టమేనా?  

-

ఏపీలో రాజకీయాలు కులాల ఆధారంగానే నడుస్తుంటాయి…రాజకీయ పార్టీలు ఎప్పుడు కులాల కుంపటిని రగులుస్తూనే ఉంటాయి. కులాలపై రాజకీయం చేసి లబ్దిపొందాలనే చూస్తాయి. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే…రాజకీయ పార్టీలు విమర్శలు చేసుకోవడం కూడా కులాల బట్టే ఉంటుంది. మామూలుగా వైసీపీ-టీడీపీలు రాజకీయ ప్రత్యర్ధులు…రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉంటారు…కాకపోతే ఇక్కడున్న విచిత్రం ఏంటంటే..రెండు పార్టీల్లో ఒకటే కులానికి చెందిన నేతలే తిట్టుకుంటారు.

ఉదాహరణకు చంద్రబాబుది కమ్మ కులం కాబట్టి..ఆ కులానికి చెందిన వైసీపీ నేతలు బాబుపై విమర్శలు చేస్తారు. కొడాలి నాని లాంటి వారు బాబుని ఎలా తిడతారో చెప్పాల్సిన పనిలేదు. అలాగే టీడీపీలో ఉండే రెడ్డి నాయకులు..జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తారు. ఇక పవన్ కల్యాణ్ ని తిట్టడానికి ప్రత్యేకంగా కాపు నాయకులు ఉంటారు. ఇంకా చెప్పాలంటే పవన్ కులానికి చెందిన పేర్ని నాని..ఈ విధంగా మాట్లాడతారో తెలిసిందే.

ఈయన కేవలం పవన్ కోసమే ఉన్నట్లు కనిపిస్తారు. మొన్నటివరకు మంత్రిగా ఉన్నారు..అప్పుడు ఓ రేంజ్ లో పవన్ పై సెటైర్లు వేశారు. ఇప్పుడు కూడా ఆయన తగ్గడం లేదు…పవన్ పై పంచులు వేస్తూనే ఉంటున్నారు. అయితే ఇలా చేయడం వల్ల పవన్…జగన్ ప్రభుత్వంపై చేసే విమర్శలు జనాల్లోకి వెళ్లవని భావిస్తారు. అంటే పవన్…జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన వెంటనే..పేర్ని ప్రెస్ మీట్ పెట్టి పవన్ పై సెటైర్లు వేస్తారు…పవన్ విమర్శలకు కౌంటర్లు ఇస్తారు.

అలా చేయడం వల్ల పవన్ విమర్శల ప్రభావం జగన్ ప్రభుత్వంపై పడకుండా, ఆ విమర్శల వల్ల నష్టం జరగకుండా ఉంటుందనేది కాన్సెప్ట్. అయితే ఇదంతా కొన్ని రోజులే వర్కౌట్ అవుతుంది…అన్నిరోజులు వర్కౌట్ అవ్వడం కష్టం. ఆ విషయం ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది…పవన్ విమర్శలకు పేర్ని కౌంటర్లు ఇచ్చిన ప్రయోజనం ఉండేలా లేదు…జనంలోకి వెళ్ళాల్సింది వెళ్లిపోతుంది…అలాగే అన్నివేళలా పేర్ని చెప్పింది జనం నమ్మడం కష్టమే. పైగా పవన్ ని తిట్టే కొద్ది కాపుల ఓటింగ్ వైసీపీకి తగ్గుతుందని చెప్పొచ్చు. గత ఎన్నికల ముందు అంటే కాపులు…టీడీపీపై కోపంగా ఉన్నారు..అలాగే పవన్ ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు సీన్ మారింది. కాబట్టి పేర్ని..పవన్ గురించి ఎంత ఎక్కువ మాట్లాడితే అంత ఎక్కువగా జగన్ కు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version