గులాబీ బాస్ దూకుడు వ్య‌వ‌హారం.. అస‌లు ప్లాన్ ఇదే..?

-

సీఎం కేసీఆర్ వ్యూహాలు ప‌న్న‌డంలో అంద‌రికంటే దిట్ట‌. ఆయ‌న చేసిన ప‌ని భ‌విష్య‌త్ రాజ‌కీయాల‌ను డిసైడ్ చేస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు కూడా ఆయ‌న చేస్తున్న రాజ‌కీయం అలాంటి ప‌నిలాగే అనిపిస్తుంది. ఇప్పుడు ఏపీతో జల జ‌గ‌డంలో ఆయ‌న దూకుడు ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. ఇప్ప‌టికే పోలీసుల‌ను ప్రాజెక్టులు వ‌ద్ద మోహ‌రించిన కేసీఆర్‌.. ఇప్ప‌డు వంద‌శాతం విద్యుత్‌ను రెండు ప్రాజెక్టుల్లో ఉత్ప‌త్తి చేయాల‌ని ఆదేశించారు.

కేసీఆర్‌/KCR

అయితే ఈ ఆదేశాల వెన‌క కేసీఆర్ అస‌లు వ్యూహం ఉంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆయ‌న్ను ఢీకొట్టే నాయ‌కుడే లేడ‌నే సంకేతాల‌ను ఢిల్లీకి ఇస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం కేంద్రంపై ఎలాంటి విమ‌ర్శ‌లు చేయాల‌న్నా కేసీఆర్ ముందుంటున్నారు. కానీ జ‌గ‌న్ మాత్రం వెన‌క‌డుగు వేస్తున్నారు. కార‌ణం కేసీఆర్‌పై ఎలాంటి కేసులు లేక‌పోవ‌డం.

ఇక ఇదే అదునుగా కేసీఆర్ దూకుడు వ్య‌వ‌హ‌రించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాల‌ని చూస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ మాటే చెల్లుతుంద‌ని నిరూపించుకుని ఆ త‌ర్వాత దేశ రాజ‌కీయాల్లో అడుగు పెట్టాల‌ని చూస్తున్నారు. ప్ర‌స్తుతం దేశంలోని ప్ర‌తిప‌క్షాల‌న్నీ బీజేపీకి వ్య‌తిరేకంగా కూట‌మిగా ఏర్ప‌డుతుండ‌టంతో కేసీఆర్ అందులో ప్రాధాన్య‌త సంపాదించేందుకు ప‌క్కా ప్లాన్ వేసుకుని ముందుకు వెళ్తున్నారు. మ‌రి ప్లాన్ స‌క్సెస్ అవుతుందో లేదా చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version