వద్దు .. అర్ధం చేసుకోండి .. చెప్పేది వినండి .. అంటూ బతిమాలుతున్న చంద్రబాబు ?

-

2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చాలా దారుణంగా ఓడిపోయింది. తక్కువలో తక్కువగా కేవలం 23 శాసనసభ స్థానాలు గెలవడంతో చంద్రబాబుకు రాజకీయంగా బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అని అప్పట్లో చాలామంది అన్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన చాలామంది నాయకులు ఇతర పార్టీల వైపు చూడటం జరిగింది. మరోవైపు పార్టీలో ఎప్పటి నుండో ఉన్న నమ్మకమైన నాయకులు చంద్రబాబు సన్నిహితులు పార్టీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. దీంతో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం వల్ల అనేక రాజకీయ ఇబ్బందులు ఎదుర్కొంటూ చంద్రబాబు పార్టీని నడిపిస్తున్నారు.అయితే తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో చాలా మంది అధికార పార్టీ లోకి వెళ్ళిపోతున్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పై మంచి క్రేజ్ ఉండటంతో లోకల్ ఎలక్షన్ల ను ఆధారం చేసుకుని తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు వైసిపి కండవ కప్పుకొన్నారు. ఇలాంటి తరుణంలో మొదటి నుండి పార్టీకి అండగా ఉన్న ప్రముఖ కుటుంబం పరిటాల కుటుంబం కూడా తెలుగుదేశం పార్టీని విడిచి పెట్టడానికి రెడీ అయినట్లు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. పరిటాల కుటుంబానికి చెందిన పరిటాల శ్రీరామ్ తన ప్రత్యర్థి జెసి దివాకర్ రెడ్డి కుటుంబానికి చంద్రబాబు గతంలో ప్రాధాన్యత ఇవ్వడంతో తన వర్గీయులను అనేక ఇబ్బందులు గురిచేశారు.

 

దీంతో చంద్రబాబు తమని అవమాన పరిచారని అప్పట్లోనే పరిటాల శ్రీరామ్ తన సన్నిహితుల దగ్గర కామెంట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పరిటాల శ్రీరామ్ మరియు పరిటాల సునీత ఉగాది పండుగ తర్వాత తెలుగుదేశం పార్టీని వీడటానికి రెడి అయినట్లు అన్న టాక్ బలంగా అనంతపురం జిల్లా లో వినపడుతోంది. దీంతో ఈ వార్తలు రావడంతో చంద్రబాబు పరిటాల ఫ్యామిలీకి ఫోన్ చేసి వద్దు .. అర్ధం చేసుకోండి .. చెప్పేది వినండి .. భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయి కంగారు పడకండి అని అన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version